కంటి ఎరుపుదనం, నొప్పి, వాపు 11567...India
9-సంవత్సరాల అబ్బాయికి క్రింది ఫోటోలో చూపిన విధంగా ప్రాక్టీషనర్ వద్దకు రావడానికి ఒక రోజు ముందునుండి కంటికి పై రెప్ప లో వాపు, ఎరుపుదనం, నొప్పి కలిగాయి.
బాబుకు ఏదయినా పురుగు కుట్టడం, లేదా ఏదయినా దెబ్బ తగిలి నట్లు సమాచారము లేదు. బాబు తల్లిదండ్రులు చెప్పిన ప్రకారము కంటి వైద్య నిపుణులు ఆంటిబయోటిక్స్ మరియు కంటిలో వేసే చుక్కల మందు సూచించారు. కానీ వారికి వైబ్రో మందుల పట్ల ఉన్న ప్రగాడ విశ్వాసము వల్ల ఆలోపతి కన్నా ఇవే మంచివని భావించారు.
2017ఆగస్టు 4 వ తేదీన ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు :
CC7.3 Eye infections...6TD నీటిలో కలిపి వేసుకొనేందుకు
కంట్లో పైన పేర్కొన్న మందు వేసిన కొన్ని నిమిషాలలోనే బాబు ప్రాక్టీషనర్ తో కంట్లో మంట చాలా వరకూ తగ్గిపోయిందని చెప్పాడు. మర్నాటికల్లా నొప్పి పూర్తిగా మాయమయ్యింది. ఎరుపుదనం కూడా 75%.తగ్గిపోయింది. రెండు రోజుల తర్వాత అనగా ఆగస్టు 6వ తేదీన కంటి ఎరుపుదనం పూర్తిగా తగ్గిపోయి ఫోటో లో చూపిన మాదిరిగా మారిపోయింది.
కనుక డోసేజ్ 6TD నుండి TDS గా రెండు రోజుల వరకూ OD గా మరో రెండు రోజుల వరకూ కొనసాగించి అనంతరం ఆపివేయబడింది.
కంట్లో వేసే చుక్కలమందు కూడా TDS నుంచి OD గా సాయంత్రం పూట వేస్తూ అలా రెండు రోజులు కొనసాగించి ఆపివేశారు. ఇంత త్వరగా బాబుకు తగ్గిపోయినందుకు అతని తల్లిదండ్రులు చాలా ఆనందించారు. ఎందుకంటే దీనివలన బాబు యాంటి బయాటిక్స్ వేసుకునే బాధ తప్పింది.
ప్రాక్టీషనర్ వ్యాఖ్య : CC7.3 Eye infections రెమిడిని, ఒక చుక్క ను 100 మి.లీ.నీటిలో వేసుకోవాలి. 30 మి.లీ.నీటిలో వేసుకుంటే కంట్లో మంట వచ్చే అవకాశం ఉంది.