మూత్ర పిండాలలో రాళ్లు 03522...Mauritius
27 యువకుడు రెండు సంవత్సరాల నుండి వెన్ను నొప్పి,అజీర్ణం,అసిడిటీ తో బాధపడుతున్నారు. తన తల్లి గతించిన తర్వాత ఇతనికి ఈ సమస్యలు ప్రారంభమయ్యాయి. దీని ఫలితంగా తను చేస్తున్న పని పైన ఏకాగ్రత నిలపలేక తరుచుగా సెలవు పెడుతూ ఉన్నారు. ఒక అలోపతి వైద్యుని సంప్రదించి మందులు వాడారు కానీ అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చాయి. ఒకసారి తీవ్రంగా వెన్ను నొప్పి రావడంతో 2014 డిసెంబర్ లో హస్పిటల్ కి వెళ్ళగా కిడ్నీ లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. లితోట్రిప్సీ (పెద్ద రాళ్ళను ధ్వని కిరణాల ద్వారా పగలగొట్టడం) చేయించడం కోసం ఇతని పేరు వెయిటింగ్ లిస్టు లో పెట్టారు. ఐతే అప్పటి వరకూ నొప్పి తగ్గడం కోసం పారాసిటమల్, బ్రుఫెన్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. మూడవసారి అపాయింట్ మెంట్ తర్వాత కూడా లితోగ్రాఫ్ ( అల్ట్రాసౌండ్ సూచి) ప్రకారం అతనికి ఇంకా రాళ్లు ఉన్నాయని లితోట్రిప్సీ చేయించుకోవలసిన లిస్టు లోనే పేరు ఉంచారు. దీనితో నిరాశ చెంది 2015,మే 27 న వీరు ప్రాక్టీ షనర్ ను సంప్రదించగా వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది :
CC4.10 Indigestion + CC13.5 Kidney stones + CC15.1 Mental & Emotional tonic…TDS
నెల రోజుల పాటు అలోపతి నొప్పి నివారినుణలతో పాటు వైబ్రో రెమిడి లు వాడిన తరువాత పేషంటు కు 50 శాతం తగ్గిందని తెలిపారు. ఇప్పుడు నొప్పి అప్పుడప్పుడూ మాత్రమే పెద్దగా తీవ్రత ఏమీ లేకుండా వస్తోంది. రెమిడి అలాగే కొనసాగించ సాగారు. మూడవ నెల అనంతరం వీరికి అజీర్ణ వ్యాధి అసిడిటీ పూర్తిగా తగ్గిపోవడంతో పాటు నడుము నొప్పికూడా పూర్తిగా అదృశ్యమయింది.ఆ సమయంలో తీసిన ఎకోగ్రఫీ లో మూత్ర పిండాలలో రాళ్లు కూడా లేవని రిపోర్టు వచ్చింది.వీరు అలోపతి నొప్పినివారిణులను పూర్తిగా ఆపివేసి వైబ్రో రెమిడి లను మాత్రము మరో 6 నెలలు TDS గా కొనసాగించి తర్వాత మెల్లిగా OD కి తగ్గించారు. 2017 అక్టోబర్ నాటికి పేషంటుకు నొప్పి గానీ కిడ్నిలో రాళ్లు గానీ ఎలాంటి సమస్యలు పునరావృతం కాలేదు ప్రస్తుతం వీరు రెమిడి ని OD గా కొనసాగిస్తూనే ఉన్నారు.