బాహ్య సర్పి మరియు అధికమైన వాంతులు 02802...UK
45 సంవత్సరాల మహిళ రెండు రోజులుగా జ్వరము తోనూ మరియు పై పెదవి ఎడమవైపు సర్పి వలన కలిగిన పుండ్ల తోనూ 2017. జూన్ 16 న ప్రాక్టీషనర్ ను సంప్రదించారు.ఆమె గొంతంతా మంట గా ఉండడమే కాక నాలిక పైన తెల్లని పూత కూడా వచ్చింది. క్రితం రోజు నుండి ఆమెకు వాంతులు కూడా బాగా ఔతున్నాయి.వీరికి వారం క్రితమే రొమ్ము భాగంలో వచ్చిన కణితి ని శస్త్రచికిత్స చేసి తొలగించారు.ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగియడమే కాక దానితాలుకు గాయం కూడా త్వరగానే తగ్గిపోసాగింది. మరి హఠాత్తుగా ఇలా ఎందుకు వ్యాధి బారిన పడిందో ఆమె చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఈ వ్యాధి వలన ఏమీ తినలేక నీరసపడ్డారు. జ్వరం నిమిత్తం పారాసిటమల్ తప్ప వీరు ఏమీ వేసుకోలేదు.ప్రాక్టీ షనర్ ఆమెకు క్రింది రెమిడి ఇచ్చారు :
CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC8.3 Breast disorders + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC11.5 Mouth infections + CC11.6 Tooth infection + CC21.7 Fungus + CC21.8 Herpes...6TD