పార్శ్వపు నొప్పి 03552...Qatar
2016 సెప్టెంబర్ 5 వ తేదీన 27-సంవత్సరాల మహిళ ఐదు సంవత్సరములుగా తరుచుగా వచ్చే పార్శ్వపు నొప్పి తో(కనీసం నెలకు ఒకసారి) బాధపడుతూ చికిత్సా నిపుణిడిని సంప్రదించారు. ఆమెకు ముక్కు మృదులాస్థి వంకరగా ఉంది మరియు దాని నిర్మాణము కూడా పలుచగా ఉన్నది. ఆమెకు తరుచుగా తలపోటుకు కారణ మవుతున్న శ్లేష్మపొరనుండి వచ్చే పిలకలకు సంభందించి A CT స్కానింగ్ రిపోర్టు నెగిటివ్ గా వచ్చినది. వారసత్వ పరంగా కూడా ఈమె తండ్రి చెల్లెలికి ఈ వ్యాధి ఉన్నది. ఆమె మానసికమైన ఒత్తిడికి లోనైనా, బాగా ప్రకాశవంతంగా ఉన్న వెలుగును చూసినా, ఏవైనా అరుపులు, శబ్దాలు విన్నా ఈ నొప్పి వచ్చేస్తుంది. ఆమె నొప్పి వచ్చినప్పుడల్లా సాధారణంగా పారాసిటమల్ టాబ్లెట్ వేసుకుంటూ చీకటి గదికి పరిమితమయి పోయేది. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది.
CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest Infections chronic…TDS ఈ డోస్ ను నొప్పి వచ్చినప్పుడల్లా ప్రతీ 10 నిమిషాలకు ఒక డోస్ చొప్పున నొప్పి తగ్గేవరకు వేసుకోవలసిందిగా సూచింపబడింది. ఇంతేకాకుండా ఆమెకు ముక్కు వంకర ఉండడంతో శ్వాశకు ఇబ్బంది ఏర్పడుతున్నందున CC19.3 Chest Infections chronic కూడా జత చేయడం జరిగింది.
రెమిడి తీసుకున్న మొదటి వారము నొప్పి తీవ్రత కొంత మందగించిందని ఆమె చెప్పారు. తరువాత మూడు వారాల వరకు మరలా నొప్పి రాలేదని ఆమె చెప్పారు. అంతేకాక రెండు నెలలవరకూ ఆమె పెళ్ళిళ్ళ నిమిత్తమో, పని నిమిత్తమో ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నా కూడా నొప్పి కలగలేదని చెప్పారు. కనుక 3 నెలల తర్వాత డోసేజ్ BD కి తగ్గించడం, మరో మూడు వారాలు OD గా తీసుకోవడం తరువాత మానివేయడం జరిగింది.
2017 జూలై నాటికి ఎప్పుడయినా బాగా శ్రమతోనో వత్తిడి తోనో కలిగే సాధారణ తలనొప్పి తప్ప పార్శ్వపు నొప్పి మాత్రం మరలా రాలేదని పేషంట్ చెప్పారు.