ఎసిడిటీ, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఆర్థరైటిస్ 03552...Qatar
2016, జూలై 21 వ తేదీన 73 సంవత్సరాల వృద్ధుడు అనేక దీర్ఘకాలికమైన వ్యాధుల నిమిత్తం ప్రాక్టీషనర్ను సంప్రదించారు.30 సంవత్సరాలుగా గుండెమంట, ఎసిడిటీ తోబాధపడుతూ ఉన్నారు దీనికి యంటాసిడ్ మాత్రలు వేసుకుంటూనేఉన్నారు. అలాగే వీరికి 15 ఏళ్లుగా కాళ్ళకు దురదలు ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఎర్రగా ఉన్నాయి. దీని నిమిత్తం డాక్టర్ వద్ద 12 ఏళ్లుగా మందులు కాళ్ళకు ఆయింట్మెంట్ వ్రాస్తూనే ఉన్నారు. ఇంతేకాక వీరు గత 5 సంవత్సరాలుగా కీళ్ళనొప్పులు ముఖ్యంగా మోకాళ్ళు మరియు భుజం నొప్పితో బాధ పడుతూ 3 సంవత్సరాలుగా మందులు వాడుతున్నారు. ఇంత కాలంగా ఈ అన్ని రకాల వ్యాధులకు మందులు వాడుతున్నా కొంచం కూడా మెరుగవలేదు. చివరికి వారు ఈ ఎసిడిటీ తరుచుగా తాను చేసే ప్రయాణములవల్ల, సమయ పాలన పాటించకుండా తినే ఆహారపు అలవాట్ల వల్ల అని భావించారు. అలాగే కీళ్ళనొప్పులు జన్యుపరమైనవి గా కూడా తెలుసుకున్నారు.
ప్రాక్టీ షనర్ క్రిందిరెమిడీలనువీరికిఇచ్చారు:
ఎసిడిటీమరియుమోకాళ్ళనొప్పులకోసం:
#1. CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis…TDS in water
ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం :
#2. CC21.3 Skin allergies + CC21.7 Fungus…TDS in water
వీరు వైబ్రియోమందులతో పాటు అలోపతీమందులను కూడాతీసున్నారు. వారం తర్వాత వీరికి అసిడిటీ మామూలు కంటే బాగా పెరిగిపోయింది కానీ కాళ్ళ దురదలు 30% ,కీళ్ళనొప్పులు 50% వరకు తగ్గాయి. ఐతే నెల తరువాత మాత్రం ఎసిడిటీ 50% తగ్గగా కాళ్ళ దురదలు కీళ్ళనొప్పులు 80% శాతం వరకు తగ్గాయి.
మరో రెండువారాలలో వీరికిఎసిడిటీలో 75% మెరుగదల కనిపించింది. కాలిదురద పూర్తిగా తగ్గింది. కనుక వీరుఫంగల్ ఇన్ఫెక్షన్నుంచి పూర్తిగాకోలుకున్నట్ట్లుభావించారు. మోకాళ్ళనొప్పులు 90% తగ్గిపోయాయి .అలోపతీ డాక్టర్ను సంప్రదించియాంటీఫంగల్ డోసేజ్ మరియు నొప్పినివారణలను తీసుకోవడం పూర్తిగా మానివేసారు.
రెండు నెలలకు అతనికి ఎసిడిటీ విషయంలో 90% మెరుగుదల కనిపించింది కానీ కీళ్ళ నొప్పులు మాత్రం అలాగే ఉన్నాయి. కడుపులో మంట తగ్గడం చేత యాన్టాసిడ్ మాత్రలు కూడా తగ్గించారు. #2నెలవరకు ODగానూ దీనిని మెల్లిగా తగ్గించుకుంటూ OW గా ఇచ్చిన గోళీలు అయిపోయినంత వరకు వాడవలసినదిగా సూచన చేయ నయినది.
మూడు నెలలు గడిచే సరికి స్వల్పంగా ఉన్న ఎసిడిటీ మరియు కీళ్ళనొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి.నవంబర్ చివరినాటికి నవంబర్ చివరినాటికి #1 ను OD గా నెల వరకూ అనంతరం మెల్లిగా తగ్గించుకుంటూ OW మెయింటనెన్సు డోస్ గా తీసుకోవలసిందిగా సూచింపబడింది.
2017 జూలై నాటి వరకూ #1ను OW. తీసుకున్నారు. ప్రస్తుతం యాన్టాసిడ్ లు తీసుకోవడం పూర్తిగా మానేసారు. ఎప్పుడయినా మసాలాలతో కూడిన భోజనం చేసినపుడు స్వల్పంగా మంట అనిపిస్తే ఒక యాన్టాసిడ్ ను వాడడం చేస్తున్నారు.అలాగే ఇన్ఫెక్షన్ కూడా పూర్తిగా తగ్గిపోయింది.ఎప్పుడయినా వాతావరణ మార్పులకు ప్రయాణ బడలికలకు మోకాలి నొప్పి వచ్చినప్పుడు నొప్పి నివారిణి వేసుకుంటారు.