5. ఆధార కణజాలపు శోధము (సెల్యు లైటిస్) 11422...India
71-సంవత్సరాల వృద్ధుడు 2016 జూన్ 16 వ తేదీన తీవ్రమైన జ్వరము మరియు వళ్ళునొప్పులతో పుట్టపర్తిలో ఉన్న జనరల్ హాస్పిటల్లో చేరారు. రక్త పరీక్షల ద్వారా అతనికి డెంగ్యు జ్వరమని నిర్ధారించి దానికి తగ్గట్టుగా వైద్యం చేసారు. మూడు రోజుల తర్వాత జ్వరము తగ్గింది కానీ అతని ఎడమ కాలి చీలమండ వద్ద ఎరుపు రంగుతో వాపు తోపాటు తాకితే ప్రాణం పోయేలా అనిపించే విధంగా నొప్పి కూడా కలగసాగింది. మరునాటికి అతనికి ఈ వాపు మరియు నొప్పి మోకాలి నుండి పాదం వరకు వ్యాపించింది. ఇది సెల్యులైటిస్ వ్యాధిగా నిర్దారింపబడి దాని నిమిత్తం యాంటీ బయోటిక్స్ మందులు ఇచ్చారు. రెండు రోజుల తర్వాత పేషంటు ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు షిప్టు చేసారు, ఎందుకంటే పేషంటుకు విపరీతంగా వచ్చిన తలపోటుతో పాటు తెలివి కూడా తప్పి పోవడం జరిగింది. ఐతే ఇక్కడి చికిత్స వల్ల మతిభ్రమణము రెండు రోజుల్లో తగ్గిపోయినా పేషంటుకు కాలిలో వాపు, చీము ఏర్పడ్డాయి. కాలికి బిగుతుగా కట్టు కట్టి కాలు కొంచం ఎత్తుగా పైకి ఉండేటట్లు ఉంచబడినది. రెండు రోజుల తర్వాత పేషంటు కు ఆపరేషన్ చేసి చీము తీసివేయాలని, చర్మము గ్రాఫ్టింగ్ చెయ్యాలని డాక్టర్ చెప్పారు. జూన్ 29వ తేదీన ఇది వినగానే పేషంటుకు నిస్త్రాణంగా అయిపోయి బి.పి డౌన్ అయిపొయింది. అందువల్ల డాక్టర్లు పేషంటును మరో రెండు రోజుల పర్యవేక్షణలో ఉంచి శస్త్ర చికిత్సను జూలై 1 వ తారీకుకు వాయిదా వేసారు.
29 వ తేదీ రాత్రి వీరి కుటుంబ సభ్యులు ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. సమయం లేకపోవడం వల్ల డాక్టర్లను సంప్రదించకుండానే మరునాటి ఉదయం ఈ నోసోడ్ ను ఇచ్చారు:
Blood nosode 200C…TDS
రెండు గంటలలోనే కాలివాపు తగ్గి పోవడంతో వేసిన బ్యాండేజ్ వదులుగా అయిపోయింది నొప్పి కూడా తగ్గిపోయింది. రోగులను చూడడానికి రౌండ్ లకు వచ్చినప్పుడు కాలివాపు 80% తగ్గిపోవడం చూసి డాక్టర్ చాలా ఆశ్చర్య పోయారు. ఐతే కాలి మడమ వద్ద కొంత వాపు, చీము ఉన్నాయి. ఎరుపురంగు కూడా చాలావరకు తగ్గిపోయింది. శస్త్రచికిత్స చేసే నిపుణుడు కూడా దీనిని చూసి ఇది నిజంగా ఒక మిరకిల్ అని చెపుతూ అతని కుటుంబ సభ్యులకు అనందం కలిగించే రీతిగా ఆపరేషన్ కూడా అవసరం లేదని చెప్పారు. అదేరోజు సాయంత్రం ఇచ్చిన నోసోడ్ తో పేషంటు ఆరోగ్య విషయంలో మరికొంత మెరుగుదల కనిపించింది. మరో రెండు రోజులు హాస్పిటల్లో ఉంచి జూలై 2వ తారికున పేషంటును డిశ్చార్జి చేసారు. మొదట నడవడం కొంత కష్టంగా అనిపించినా త్వరలోనే పేషంటు తన నిత్య కృత్యాలకు అలవాటు పడిపోయారు.
ఆసుపత్రి వర్గాలు పేషంటుతో తగినంత విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే దుమ్ము, ధూళిలకు ఏమాత్రం లోనైనా సెల్యులైటిస్ తిరిగి వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నోసోడ్ ను 2016 డిసెంబర్ వరకూ TDS గానూ దీనిని క్రమంగా తగ్గించుకుంటూ 2017 మార్చి 31 తేదికి పూర్తిగా మానివేసే నాటివరకు OW గానూ వాడడం జరిగింది. ఇప్పుడు పేషంటు ఎంత ఆనందంగా ఉన్నారంటే తనకు తెలిసిన వారు ఎవరైనా ఆరోగ్య సమస్యలతో కనిపిస్తే మీరు వైబ్రియో మందులు వాడండి తగ్గిపోతుంది అని సలహా ఇస్తున్నారు.
ప్రస్తుతం పేషంటు కాలినొప్పి పూర్తిగా తగ్గిపోవడమే కాదు తనకు ఏ ఇతర సమస్యలు వచ్చినా వైబ్రియోనిక్స్ మందులే వాడుతున్నారు.