మూలవ్యాధి, ఫీకల్ ఇంకంటినెన్స్ ( మలము ఆపుకొనలేకపోవుట), ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ , గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ (అజీర్ణ సమస్యలు) 01001...Uruguay
రక్తం కారుతున్న మూలలు మరియు మలము ఆపుకొనలేకపోవుట వంటి సమస్యలతో గత పదిహేను ఏళ్లుగా బాధపడుతున్న ఒక 74 సంవత్సరాల వృద్ధుడు 2016 జూన్ 20 న చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. రోగికి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ మరియు గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వంటి అజీర్ణ సమస్యలు ఉన్నట్లుగా వైద్యులచేఒక నెల క్రితం నిర్ధారించబడింది.
ఈ రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
#1. CC3.2 Bleeding disorders + CC4.4 Constipation + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC12.1 Adult tonic…TDS
రోగి ఈ సమస్యకు ఇతర మందులను తీసుకోలేదు. జూన్ 27 రోగికి మూలవ్యాధి కారణంగా రక్తం కారటం సమస్య పూర్తిగా తగ్గిపోయింది. IBS (ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్) సమస్య 20% వరకు మెరుగుపడింది. అయితే మలము ఆపుకొనలేకపోవుట సమస్య లో మెరుగుదల ఏర్పడలేదు.
జులై 13 న క్రింది మందులు రోగికి ఇవ్వబడినాయి:
#2. CC4.2 Liver & Gallbladder tonic + CC4.8 Gastroenteritis + CC15.1 Mental & Emotional tonic + #1…TDS
చికిత్సా నిపుణులు రోగికి గుదము కండరాలను బలపరిచే వ్యాయామాల వివరాలను ఇచ్చి ప్రతిరోజు అనేక మార్లు ఆ వ్యాయామాలను చేయమని సలహా ఇచ్చారు. ఆగస్టు 19 న రోగికి మలము ఆపుకొనలేకపోవుట మరియు IBS సమస్యలో 90% మెరుగుదల ఏర్పడింది. రోగి #2 మందును TDS మోతాదులో తీసుకోవటం కొనసాగించారు. 2017 జనవరి 17న మందు యొక్క మోతాదు రెండు వారాలకు BDకి తగ్గించబడింది. జనవరి 31 న OD కి తగ్గించబడింది. అయితే, రోగికి రక్తం కారటం సమస్య తిరిగి ఏర్పడింది. మందు యొక్క మోతాదు తిరిగి BD కి పెంచటం జరిగింది. దీని తర్వాత రక్తం కారటం సమస్య తగ్గింది మరియు ఇతర రోగ లక్షణాలు కూడా తొలగిపోయాయి. రోగి ఇప్పుడు BD మోతాదులో మందును తీసుకుంటున్నారు.