Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

వ్యాకులత, భయం, గాభరా 03535...USA


వ్యాకులత, తీవ్ర భయం మరియు గాభరా వంటి లక్షణాలతో బాధపడుతున్న ఒక 30 ఏళ్ల వ్యక్తి చికిత్సా నిపుణులను సంప్రదించారు. గత పది ఏళ్లుగా ఈ లక్షణాలు ఉన్నప్పటికీ రెండు సంవత్సరాలుగా తీవ్రమైనట్లు రోగి తెలిపారు. మనోరోగ వైద్యుడను సంప్రదించినప్పటికీ ఫలితం లభించలేదు. గాభరా పడిన సమయంలో రోగికి రక్తపోటు తీవ్రమయేది (160 /80), గుండె దడ పెరిగి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉండేది. దీని కారణంగా అతనికి తల తిరిగేది. తన భార్య వారి మొదటి బిడ్డను జన్మనిచ్చిన సమయంలో రోగి యొక్క లక్షణాలు మరింత తీవ్రమయ్యాయి. రోగి తన వ్యాకులత మరియు భయాలను ఎవరితోనూ పంచుకునేవారు కాదు. వ్యాకులత కారణంగా రోగి ఏకాగ్రతతో ఏ పనిని చేయలేకపోయేవారు. తాను అనుభవిస్తున్న మనో వ్యాకులత తన పగవాళ్లకు కూడా కలగకూడదని అతను భావించారు. ఎప్పటికైనా ఈ సమస్య తీరి తాను సాధారణ స్థితికి చేరుకుంటారన్న నమ్మకం అతనికి లేదు. బాల్యంలోనే తన తండ్రిని కోల్పోయాడని మరియు తన తల్లి ఒక భయస్తురాలని ఎల్లప్పుడూ వ్యాకులపడుతూ ఉండేదని తనకి కూడా అదే మనస్తత్వం వచ్చిందని చికిత్సా నిపుణులకు రోగి తెలిపారు. రోగి ఈ లక్షణాలకు ఏ విధమైన మందులను తీసుకోవడం లేదు.

2016 ఫిబ్రవరి 10న క్రింది మందులు రోగికి ఇవ్వబడినాయి:
#1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disabilities…TDS 

ప్రతివారం రోగిని మానిటర్ చేయడం జరిగింది. రెండు వారాల తర్వాత తన మనస్థితిలో మరుగు ఏర్పడినట్లుగా రోగి తెలిపారు. మూడు వారాల తర్వాత రోగి యొక్క వ్యాకులత, భయం మరియు గాభరా 90% వరకు తగ్గిపోయాయి. రోగి యొక్క రక్తపోటు 135 /80 కి తగ్గింది.

2016 ఏప్రిల్ లో రక్తపోటు సమస్యకు మందు చేర్చి ఇవ్వబడింది:
#2. CC3.3 Blood pressure + #1...TDS

ఆరు వారాల తర్వాత రోగి దీర్ఘకాలంగా బాధపడుతున్న వ్యాకులత మరియు భయం నుండి పూర్తిగా విముక్తి పొందారు. ఆగస్టులో రోగి యొక్క రక్తపోటు సాధారణ స్థాయికి (120 /80) చేరుకుంది. నాలుగు నెలల్లో రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి 100% మెరుగుపడింది. మొదట్లో వైబ్రియానిక్స్ పై నమ్మకం లేని ఈ రోగి తనకి జరిగిన ఈ అద్భుతానికి కృతజ్ఞతలను తెలుపుకున్నారు. ఎల్లప్పుడూ చింతిస్తూ భయపడుతూ ఉండే రోగి ప్రశాంతంగా మారిపోవడం చూసిన రోగి యొక్క కుటుంభ సభ్యులు ఎంతో ఆశ్చర్య పోయారు. ఆత్మవిశ్వాసంతోను మరియు శక్తివంతంగాను అతను జీవించడం ప్రారంభించారు. వ్యాకులత మరియు భయం తొలగటం కారణంగా అతను తన దున చర్యలను ఏకాగ్రతతో చేయగలిగారు. 2017 జనవరి నాటికి అతను అంతకు ముందు బాధపడిన మనోరోగ లక్షణాలు తిరిగి రాలేదు. ఇప్పటికి అతను #2 TDS మోతాదులో తీసుకుంటున్నారు. ప్రస్తుతం రోగికి ఏర్పడిన ఆఖలేసియా (ఆహార నాళము బిగుసుకుపోయి మ్రింగ లేక పోవుట) సమస్యకు చికిత్సా నిపుణులు వైబ్రో చికిత్సను ఇవ్వడం జరుగుతోంది.