శిశువులో నిగూఢమైన నొప్పి 02921...Italy
2016 ఏప్రిల్ 16వ తేదిన ఒక తల్లి తన 8 సంవత్సరాల పాపను ప్రాక్టీషనర్ వద్దకు తీసుకొని వచ్చింది..ఆ పాప పొత్తి కడుపులోను మరియు ప్రేగులలోనూ విపరీతమైన నొప్పితో 3 నెలలు గా బాధపడుతూ ఉంది..కానీ ఆ నొప్పి రాను రానూ తలకు, వీపు వైపు, భుజాలకూ కాళ్ళకు చేతులకు వ్యాపించింది. ఆమె ఆ నొప్పి భరించలేక పెద్దలు తీసుకునే అధిక డోసుకు అలవాటుపడిపోయింది. కానీ ఆ బాధా నివారణలను వాడడంలో ఆమె పొందే ఉపశమనం కొద్ది సేపు మాత్రమే. డాక్టర్లు ఆమె బాధకు నివారణ కానీ కనీసం ఆ బాధకు కారణం ఏమిటో కూడా తెలుసుకోలేక పోయారు. వైద్య పరీక్షల ద్వారా కూడా ఆమె బాధకు కారణం ఏమిటో తెలుసుకో వడానికి సాధ్యం కాలేదు. ఆమె తల్లి చెప్పిన దానినిబట్టి పాప గతించిన కాలంలో ఎట్టి మానసిక సంబంధ వ్యాదులకు భయాందోళనల కూడా గురికాలేదు. ఈ నొప్పి ఎప్పుడయినా ఎక్కడయినా మొదలు కావచ్చు. ఈ నొప్పి కొన్ని నిమషాలు కానీ కొన్ని గంటలు కానీ ఉంటుంది. ఇప్పటికే ఆమె 2 నెలలు పాఠశాలకు వెళ్ళలేకపోయినది అంటూ ఆ తల్లి తన గోడు వెళ్ళ బోసుకున్నది. తన స్నేహితుల ద్వారా విబ్రియో గురించి తెలుసుకొని వచ్చానని చెప్పింది. ఏప్రిల్ 17వ తేదీన పాపకు క్రింది డోస్ ఇవ్వడం జరిగింది:
CC4.6 Diarrhoea + CC12.2 Child tonic…6TD
కేవలం ఒక్క రోజులోనే పాపకు నొప్పి 75% తగ్గిపోయి తరువాత రండు రోజులూ ఆనందంగా గడిపింది. కానీ 3 వ రోజు ఆమెకు పుల్లౌట్ రావడంతో భరింపరాని నొప్పి వచ్చింది. పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా ప్రయోజనం లేకపోవడంతో మందు వేసుకోవడం రెండు రోజులు ఆపారు.
5వ రోజున రోజుకు ఒక్కటి చొప్పున OD డోస్ ఇవ్వబడింది. అదే రోజు ఆమెకు 10 శాతం బాధ నివారణ ఐనట్లు అనిపించింది. వారం గడిచేసరికి పెయిన్ కిల్లర్స్ వాడడం పూర్తిగా మానేసింది. నొప్పి 75 శాతం తగ్గిపోయింది. ఐతే పాప కొంత అనీజీ గా ఉన్నప్పటికీ ప్రాక్టీషనర్ అదే డోస్ కంటిన్యూ చేయాలనీ నిశ్చయించారు. రెండు వారలు గడవగానే నొప్పి పూర్తిగా నూరు శాతం మాయమయ్యింది. పాప మరియు ఆమె తల్లి ఆనందానికి అవధులే లేవు.
అదే డోస్ 3 వారాలు కంటిన్యూ చేసాక 3TW గా ఒక వారము 2TW గా మరొక వారము చివరగా OW గా రెండు వారాలు వేసుకొని జూన్ 30 న ఆపివేసింది. అక్టోబర్ 2016 నాటికి ఆమెకు ఏ విధమైన నొప్పి రాలేదు.