హే ఫీవర్ మరియు తలపై దురద 02899...UK
2014మార్చి 29వ తేదీన, 31-సంవత్సరాల ఒక మహిళ హే ఫీవర్ మరియు తలపై దురద చికిత్స నిమిత్తము ప్రాక్టీషనర్ ను సంప్రదించినది. తనకు 13వ సంవత్సరము నుండి ఈ వ్యాధితో బాధ పడుతూ యాంటీ హిస్టమిన్ టాబ్లెట్లు వాడుతున్నారు. ఈ వ్యాధి వల్ల ఆమెకు దురద, కంటివెంట నీరు కారడం ఇంతేకాక కలువలున్న తావులకు వెళ్ళినప్పుడు విపరీతమైన తుమ్ములు.రావడం జరిగేది. యాంటీ హిస్టమిన్ టాబ్లెట్లు కొంత ఉపశమనం కలిగించినా 2012 నుండి జ్వరం మాత్రం చాలా తీవ్రముగా వస్తుండేది. అంతేకాకుండా 5 సంవత్సరాలకు పైగా ఆమె తల పైన దురదతో బాధ పడుతూ ఉన్నది. కారణం ఏమిటన్నది తెలియ రాలేదు. డాక్టర్ సలహా పైన ఆమె షాంపు మార్చడంతో కొంత ఉపశమనం కలిగింది కానీ బాధ మాత్రం పూర్తిగా పోలేదు. ఆమెకు క్రింది డోస్ ఇవ్వడం జరిగింది.
హే ఫీవర్ మరియు కంటి దురద,నీరు కారడం:
#1. CC7.3 Eye infections + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies…TDS.
తల పైన దురద:
#2. CC15.1 Mental and Emotional tonic + CC21.3 Skin allergies…TDS.
ఒక వారం తరవాత ఆమె తల పైన దురద పూర్తిగా తగ్గిపోయిందని చెప్పింది. ఐతే ప్రాక్టీషనర్ సలహా పైన ఆమె మరొక 3 వారాలు అదే డోస్ వాడింది. హే ఫీవర్ విషయానికొస్తే ఆమె కంటి దురదలు, నీరు కారడం 50 శాతం వరకూ నయమైనవి. అందువల్ల ఆమె తాను తీసుకొనే ట్యాబ్ లెట్ డోస్ కూడా తగ్గించింది. జూన్ 2014 ఆమెకు నిరాశాజనకంగా ఉన్న కాలము. హే ఫీవర్ తట్టుకోలేని విధంగా రావడంతో ఆమె ఆరోగ్యము పూర్తిగా శిధిలావస్థలోకి చేరుకొంది. వాతావరణం వేడిగా పొడిగా ఉన్నప్పుడు ఆమె పరిస్థితి మరీ విషమం గా ఉండేది. అప్పుడు ఆమె మొదటి డోస్ #1 ను 20 నిమిషాల తేడాతో ఎన్ని ఎక్కువ సార్లు వీలైతే అన్నిసార్లు వేసుకోమని ప్రాక్టీ షనర్ సూచించారు. 4 వారాల తర్వాత ఆమెకు నూరు శాతం నయమయ్యి ఎంతో అనందం పొందింది. తర్వాత ఆమె సెప్టెంబర్ వరకూ రోజుకు రెండు సార్లు వేసుకోవలసింది గా సూచింప బడింది. జనవరి 2015 లో ఆమెకు తల పైన దురద తిరిగి ప్రారంభ మయ్యింది. కానీ రెండవ డోస్ #2 ను వారం రోజుల పాటు తీసుకోగానే పూర్తిగా తగ్గిపోయింది. 2015 వేసవి నుండి ఆమె మొదటి డోస్ #1 ను మధ్య మధ్య తీసుకుంటూ యాంటీ హిస్టమిన్ టాబ్లెట్లు పూర్తిగా మానివేసినది. విబ్రియో రెమెడీ తన పైన అద్భుతంగా పనిచేశాయని చెపుతూ ఇంక తనకున్న ఒకే ఒక సమస్య లిలీ పువ్వులు దగ్గర కాగానే తుమ్ములు రావడం. 2016 నుండి హే ఫీవర్ ను కంట్రోల్ లో ఉంచడానికి ఆమె ఒకటవ డోస్ #1ను రోజుకు ఒకసారి OD గా తీసుకోసాగింది. కానీ పుప్పొడి పెరిగే సీజన్లో రెండుసార్లు BD తీసుకోవలసిందిగా సూచింప బడింది. రాను రాను ఆమె కలువలకు చాలా దగ్గరగా ఉన్నా ఏ ఇబ్బంది లేని పరిస్థితి కలిగింది. మధ్యస్తంగా ఉండే రోగ లక్షణాలు బాగా వేడిగా ఉండే వేసవి రోజులలో పుప్పొడి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కనిపించేవి. కనుక సెప్టెంబర్ 2016 నుండి 1 వ డోస్ పూర్తిగా మానివేసి 2017 వేసవిలో ప్రివెంటివ్ డోస్ లాగా తీసుకొనుటకు నిర్ణయించుకున్నారు. అంతేకాదు 2016, డిసెంబర్ తర్వాత తల పైన దురద తిరిగి రాలేదు.