కుక్క లో దీర్ఘకాలిక దగ్గు, శ్వాస కోశ ఇబ్బంది 00462...USA
మన విబ్రియో ప్రాక్టీషనర్ తమ ఇంటి ప్రక్కన ఉన్న వారి 13 సంవత్సరాల కుక్క ఒక సంవత్సరం నుండి పొడి దగ్గు మరియు శ్వాస కోశ సమస్యతో బాధ పడుతున్నట్లు గ్రహించారు. వెటర్నరీ డాక్టర్ ఇచ్చిన మందులు ఏమీ పనిచెయ్యలేదు, సరికదా దానిని చంపేసి దాని బాధ నుండి విముక్తి చేయమని అయన సలహా ఇచ్చారు. కుక్క యజమాని సూచన పైన 2013 లో విబ్రియో ప్రాక్టీషనర్ వైద్యం ప్రారంభించారు. కుక్క యజమాని కొన్ని రోజులు వెటర్నరీ మందులను ఇవ్వడం వాయిదా వేసి క్షుణ్ణంగా కుక్కను పరీక్షింప చేసారు. కుక్క ఉపిరితిత్తులు బాగానే ఉన్నవి కానీ సెర్వికల్ గ్రంధులు బాగా ఉబ్బి ఉన్నవి,నొప్పి మాత్రం లేదు. క్రింది కొమ్బో డోస్ కుక్కకు ఇవ్వబడింది.
NM36 War + NM63 Back-up + NM95 Rescue Plus + CC19.6 Coughchronic….నీటితో రెండు రోజుల కొకసారి మార్చే విధంగా
రెండు రోజుల తర్వాత యజమాని కుక్కతో నడుస్తూ కనిపించారు. వ్యాది 100 శాతం నయమయ్యింది. వారం తర్వాత డోస్ ఆపేసి నప్పటికీ కుక్క వ్యాది పూర్తిగా తగ్గిపోయి మరో ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ప్రశాంతంగా జీవితం గడిపి నిద్రలో ప్రాణం వదిలింది.