గర్భసంచిలో కనపడని శిశువు యొక్క ఒక మూత్రపిండము 01339...USA
29-సంవత్సరాల ఒక మహిళ మే 2016 లో ఒక అబ్బాయికి జన్మనిచ్చింది.మామూలుగానే గర్భధారణ సమయం లో 20 వ వారంలో నిర్వహించే అల్ట్రాసౌండ్ లో బేబీకి ఒక్క మూత్రపిండము మాత్రమే ఉన్నట్లు డాక్టర్లు కనుగొన్నారు. కనుక డెలివరీ అయ్యే లోపు మిగిలిన సమయంలో ప్రతీ 4 వారాలకొక సారి అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయవలసిందిగా వారు అభ్యర్ధించారు. ఈవిధముగా జరిగినందుకు ఆ యువజంట చాలా నిరాశ కు లోనయ్యారు. తదుపరి నిర్వహించిన అల్ట్రా సౌండ్ స్కానింగ్ లో రెండుసార్లు కూడా అదే రిపోర్టు- కిడ్నీ కనిపించకుండా పోవడం. ఆమె భర్త ఈ విషయాన్నీ ఒక సాయి భక్తునికి చెప్పినప్పుడు వారు సాయి విబ్రియో గురించి చెప్పారు. అంతేగాక ఆ ప్రాక్టీ షనర్ యొక్క ఫోన్ నెంబరు మరియు ఎడ్రెస్ కూడా ఇచ్చారు. ఆ రోజు సాయంత్రమే భర్త చెప్పిన ఎడ్రస్ కు వెళ్లి ప్రాక్టి షనర్ను కలసి తన బాధంతా చెప్పుకున్నాడు.
ఫిబ్రవరి 24 వ తేదీన క్రింది కోమ్బో డోస్ ఇవ్వబడింది . .
CC10.1 Emergency + CC12.1 Adult tonic + CC12.2 Child tonic + CC13.1 Kidney & Bladder tonic + CC13.2 Kidney & Bladder infections + CC13.4 Kidney failure + CC13.5 Kidney stones + CC15.1 Mental & Emotional tonic…TDS
౩ రోజుల పాటు రోజుకు ౩ సార్లు తదనంతరం రోజుకు 4 సార్లు ఇవ్వవలసిందిగా సూచింప బడింది. ఆ తరువాతరోజులలో 4వ వారం నిర్వహించిన స్కానింగ్ లో కూడా కిడ్నీ కనిపించలేదు కానీ 36వ వారం నిర్వహించిన స్కానింగ్ లో రెండవ కిడ్నీ కనిపించింది. ఆ యువజంట ఆనందానికి అవధులే లేవు. అది బాబా ప్రసాదంగా భావించి వారు బాబాకి తమ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 2016 ఏప్రిల్ నెల 30 తేది న పూర్తీ ఆరోగ్యంతో ఉన్న మొగ బిడ్డకి ఆ తల్లి జన్మ నిచ్చింది.
ఈ సంఘటన గూర్చి శిశువు యొక్క తండ్రి వ్యాఖ్యానం :
“….పుట్టబోయే శిశువులో ఒక కిడ్నీ లోపించిందనే విషయం మమ్మల్ని ఎంతగానో కృంగదదీసింది. వేరు దారి లేక స్వామికే మొరపెట్టుకున్నాము. మా ప్రార్ధన మన్నించి బాబు యొక్క లోపాన్ని సరిచేసినందుకు స్వామి కి ఎంతో కృతజ్ఞులం. మాకు దారి చూపిన ప్రాక్టి షనర్ కు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్వామి మా పట్ల ప్రదర్శించిన అవ్యాజమైన ప్రేమకు శతకోటి వందనాలు తెలియ చేసుకుంటున్నాము.."