హైపర్ అసిడిటీ, అజీర్ణము, తలనొప్పి మరియు నిద్రలేమి సమస్య 02840...India
ఒక 28 ఏళ్ల మహిళ, రెండు సంవత్సరాలు పాటు, హైపర్ అసిడిటీ, అజీర్ణము, తలనొప్పి మరియు నిద్రలేమి సమస్యలతో బాధపడేది. ఆమె అజీర్ణము సమస్యకు యాంటాసిడ్ మాత్రలను తీసుకుంటూ ఉండేది. ఈ మాత్రల ద్వారా ఆమెకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగేది. అందువలన రోగి వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకుంది.
2013 జూన్ 24 న క్రింది మందులను ఆమెకు ఇవ్వడం జరిగింది:
CC4.2 Liver & Gallbladder tonic + CC4.10 Indigestion + CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders…6TD
ఐదు వారముల తర్వాత హైపర్ అసిడిటీ సమస్యలో 50%, అజీర్ణము మరియు తలనొప్పి సమస్యలలో 60% మరియు నిద్రలేమి సమస్యలో 30% మెరుగుదల ఏర్పడింది. దీని కారణంగా వైబ్రో మందు యొక్క మోతాదు టీడీస్ కి తగ్గించబడింది. నాలుగు వారముల తర్వాత హైపర్ అసిడిటీ 90%, అజీర్ణము 100%, తలనొప్పి మరియు నిద్రలేమి సమస్యలు 80 % వరకు నయమైపోయాయి. దీని కారణంగా మందు యొక్క మోతాదు ఒక నెల వరకు OD కి తగ్గించబడింది. రోగ లక్షణాలన్నీ పూర్తిగా తొలగిపోయినట్లుగా 2013 సెప్టెంబర్ 25 న రోగి తెలిపింది. 2013 డిసెంబర్ నాటికి ఈ మహిళ ఏ విధమైన రోగ సమస్య లేకుండా ఆనందముగా జీవిస్తున్నది. 2016 మార్చిలో ఈ మహిళకు అరుదుగా అజీర్ణ సమస్య ఏర్పడినప్పుడు వైబ్రో మందును పది నిమిషాలకు ఒక గోలి చప్పున గంటలో ఆరు సార్లు తీసుకునేది. మొదటి గోలి తీసుకున్న అరగంట సమయంలో ఆమెకు ఉపశమనం కలిగేది. ఈ మహిళ ఇప్పుడు ఒక ఆరోగ్యమైన జీవన శైలిని పాటిస్తోంది.