డయాబెటిస్, వణుకు, అధిక రక్తపోటు, పాక్షిక చెవుడు 03535...USA
అనేక దీర్ఘకాలిక రోగ సమస్యలతో బాధపడుతున్న ఒక 76 సంవత్సరాల వృద్ధుడు ఒక చికిత్సా నిపుణుల సహాయం కోరడం జరిగింది. 1984 లో రోగి యొక్క కుమారుడు ఒక ప్రమాదంలో మరణించాడు. దీని కారణంగా కలిగిన మానసిక క్రుంగుపాటు యొక్క ప్రభావం ఈయన శరీరం పై పడింది. ప్రమాదంలో కుమారుడును కోల్పోయిన రెండు సంవత్సరాల తర్వాత రోగికి డయాబెటిస్ మెల్లిటస్ వ్యాధి నిర్ధారణ జరిగింది. మెట్ఫార్మిన్ మందుతో ఈయనకు చికిత్స ప్రారంభించబడింది మరియు పది సంవత్సరాల తర్వాత ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రారంభించ బడింది. రక్తంలో పెరుగుతున్న చక్కర స్థాయిల కారణంగా ఇంస్యులిన్ యొక్క మోతాదు క్రమంగా పెంచబడింది. గత మూడు సంవత్సరాలుగా రోగి ప్రతి రోజు 60 యూనిట్ల ఇంస్యులిన్ తీసుకునేవారు. ఈ విధంగా చికిత్స తీసుకుంటున్నప్పటికీ రోగి యొక్క ఫాస్టింగ్ చక్కర స్థాయి 140 మరియు భోజనం తర్వాత 190 mg/dL.
డయాబెటిస్ ద్వారా సాధారణంగా కలిగే పరిధీయ నరాల వ్యాధి కారణంగా రోగికి అరికాళ్ళల్లో మంట కలిగేది. ఈ సమస్య కొరకు రోగి మూడు సంవత్సరాల పాటు అల్లోపతి మందులు తీసుకున్నారు.
ఆరు సంవత్సరాల క్రితం రోగికి కొరోనరీ ఆర్టరీ డిసీస్ (హృద్ధమని వ్యాధి) కారణంగా రెండు స్టెంట్లు అమర్చబడినాయి. రోగి ఈ వ్యాధికి సంబంధించిన అలోపతి మందులను వ్యాధి నివారణ కొరకు తీసుకొనేవారు. అంతేకాకుండా రోగి క్రమం తప్పకుండా బీ.పీ మందులను తీసుకోవడం కారణంగా రోగి యొక్క బీ.పీ సాధారణ స్థాయిలో ఉండేది.
ఆరు నెలల క్రితం రోగికి పార్కిన్సన్ వ్యాధి లాంటి లక్షణాలు ఏర్పడి వణుకు ఏర్పడింది. దీనికి మూల కారణం పరిధీయ నరాల వ్యాధి సమస్య. రోగికి నిద్రించే సమయంలో కూడా అరచేతులు తీవ్రంగా వణికేవి. దీని కారణంగా రోగికి ఇబ్బంది కలిగేది. నాలుకలో వణుకు ఏర్పడడం కారణంగా రోగికి మాటలు స్పష్టంగా పలికేవి కాదు. ఈ రోగ లక్షణం మొదలైన సమయం నుండి రోగి అల్లోపతి మందులు తీసుకుంటున్నారు గాని రోగికి ఉపశమనం కలుగలేదు.
నాలుగు సంవత్సరాల పాటు రోగికి రెండు చెవులలో పాక్షిక వినికిడి లోపం ఉండేది. రోగి యొక్క తల్లి తండ్రులు వృద్ధాప్యంలో ఇదే సమస్యతో భాధపడేవారు కాబట్టి ఈ సమస్య రోగికి వంశానుగతంగా వచ్చియుండవచ్చు. ఈ సమస్యకు రోగి ఏ విధమైన చికిత్స తీసుకోలేదు.
డయాబెటిస్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు మొదలైనట్లుగా రోగి చికిత్సా నిపుణులకు తెలిపారు. ఇతర ఆరోగ్య సమస్యలు భరించతగినవిగా ఉండటం కారణంగా, డయాబెటిస్ చికిత్సతో రోగికి చికిత్స ప్రారంభించబడింది.
2015 డిసెంబర్ 11 న రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
#1. CC6.3 Diabetes + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS నీటిలో
రెండు నెలల వరకు అతను అల్లోపతి మందులతో పాటు వైబ్రియానిక్స్ చికిత్సను తీసుకోవడం కొనసాగించారు. ప్రతిరోజు పర్యవేక్షణ చేయడంతో రక్తంలో చక్కెర స్థాయి యొక్క పర్యవేక్షణ ద్వారా రోగి యొక్క ఫాస్టింగ్ స్థాయి నిలకడ స్థాయికి చేరుకుంది (110 mg /dL). దీనికారణంగా ప్రతిరోజు రోగి తీసుకొనే ఇన్సులిన్ యొక్క మోతాదు 60 యూనిట్ల నుండి 30 యూనిట్లకు తగ్గించబడింది. రోగి యొక్క నరాల వ్యాధి 10% వరకు మాత్రమే మెరుగుపడింది.
చక్కెర స్థాయిలో మెరుగు ఏర్పడడం కారణంగా వణుకు రోగం, CAD మరియు వినికిడి లోపం వంటి ఇతర రోగ లక్షణములకు చికిత్సను ప్రారంభించేందుకు ప్రోత్సాహం కలిగించింది.
2016 ఫిబ్రవరి 20 న రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
#2. CC3.5 Arteriosclerosis + CC5.2 Deafness + CC18.4 Paralysis + CC18.6 Parkinson’s disease + #1…TDS నీటిలో
రెండు నెలల్లో వణుకు లక్షణంలో విశేషమైన మెరుగుదల ఏర్పడింది. నాలుక వణుకులో 40%, చేతులలో 90% మరియు కాళ్లలో 100% మెరుగుదల ఏర్పడింది. ఆపై రెండు నెలల వరకు రోగి మందులను తీసుకోలేదు. జూన్ నాటికి రోగి యొక్క చేతులలో వణుకు పూర్తిగా తగ్గిపోయింది మరియు నాలుకలో 75 % వరకు తగ్గింది. కాళ్ళు వణకడం కారణంగా రోగి ఒకసారి క్రింద పడడం జరిగింది. దీని కారణంగా రోగికి నడవాలంటే భయంగా ఉండేది. అయితే వైబ్రో చికిత్స ద్వారా కాళ్ళ వణుకు తగ్గిపోవడంతో రోగి తిరిగి తన అలవాటు ప్రకారం ప్రతి ఉదయం వాకింగ్ చేయడం ప్రారంభించారు. రోగి తన జ్ఞ్యాపక శక్తిని మెరుగు పర్చేందుకు వైబ్రో మందును ఇవ్వవలిసిందిగా కోరటంతో తగిన వైబ్రో మిశ్రమాలను చేర్చి రోగికి ఇవ్వడం జరిగింది.
జూన్ 10 న క్రింది మందులు రోగికి ఇవ్వబడినాయి:
#3. CC3.4 Heart emergencies + CC10.1 Emergencies + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic + CC18.2 Alzheimer’s disease + #2…TDS నీటిలో
2016 అక్టోబర్ నాటికి రోగికి ఏ విధమైన రోగ లక్షణము తిరిగి కలుగలేదు. రోగి క్రమం తప్పకుండా వ్యాయాయం (వాకింగ్) చేస్తున్నారు. అంతేకాకుండా రోగి యొక్క మాటలో స్పష్టత ఏర్పడింది. రోగి యొక్క రక్తంలో చక్కెర స్థాయి ఫాస్టింగ్ సాంపిల్ :110 మరియు భోజనం తర్వాత 150 mg /dL కు తక్కువ ఉన్నాయి. ప్రస్తుతం రోగికి వినికిడి లోపం పూర్తిగా తగ్గిపోయింది. డయాబెటిస్ పూర్తిగా నయమైపోయిన కారణంగా రోగికి ఇప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్లు, నరాల బలహీనతకు సంబంధించిన మందులు మరియు బి.పి మందులు తీసుకొనే అవసరం లేదు ! రోగికి #3 మందును మరి కొంత కాలం తీసుకోవలసిందిగా సలహా ఇవ్వబడింది.
చికిత్సా నిపుణుల వ్యాఖ్యానం:
రోగి ఇప్పుడు శీర్షాసనం కూడా చేయగలుగుతున్నారు! మంచంపట్టే స్థితి నుండి రోగి తిరిగి ఆరోగ్యమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. చికిత్సకు ముందు చేతులు వణకడం కారణంగా రోగికి తన చేతులను కదలకుండా పట్టుకునేందుకు ఇతరుల సహాయం కావలసివచ్చేది. రోగి ఇప్పుడు శీర్షాసనం కూడా చేయగలుగుతున్నారు! మంచంపట్టే స్థితి నుండి రోగి తిరిగి ఆరోగ్యమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. చికిత్సకు ముందు చేతులు వణకడం కారణంగా రోగికి తన చేతులను కదలకుండా పట్టుకునేందుకు ఇతరుల సహాయం కావలసివచ్చేది. రోగికి నాలుక వణకడం చాలా వరకు తగ్గడం కారణంగా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు.