Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అక్యూట్ మైలాయిడ్ లుకేమియా 00512...Slovenia


2015  డిసెంబర్ లో మైలాయిడ్ ల్యుకేమియా (బోన్ మారోకి(ఎముక మజ్జ) సంబంధించిన కాన్సెర్) తో బాధపడుతున్న ఒక 48 ఏళ్ల వ్యక్తికి వైబ్రో చికిత్సా నిపుణులు చికిత్సను అందించడం జరిగింది. వైబ్రో చికిత్స ప్రారంభించడానికి రెండు సంవత్సరాల ముందు నుండి రోగికి మెడ శోషరస కనువులు పెరిగే సమస్య ఉండేది. 2013 లో రోగికి కుడి వైపు మెడ మీద లింఫ్ గ్లాన్డ్ (రసగ్రంథి) వాచింది. 2015 లో అదే స్థానంలో తిరిగి మరింతగా వాచింది.  చెమట పట్టడం, వణుకు, నాసారంధ్రం అడ్డంకులు మరియు నోరు ఎండిపోవుట వంటి లక్షణాలు కూడా రోగికి ఉండేవి. ఉమ్మినీటి గ్రంథులలో వాపు (సయాలాడినైటిస్) ఉండటంతో రోగికి అల్లోపతి మందులు ఇవ్వబడినాయి. వీటి ద్వారా రోగికి ఉపశమనం కలిగింది.

2015 డిసెంబర్ లో మూడవ సారి రోగికి లింఫ్ గ్రంధులలో (శోషరసగ్రంథులు) వాపు ఏర్పడింది. ఈ సారి వాపు కుడి వైపు ఏర్పడింది. తిరిగి ఉమ్మినీటిగ్రంథులలో వాపు ఉందని తెలిసింది. తరచుగా కలుగుతున్న ఈ లక్షణాల కారణంగా వైద్యులకు అనుమానం కలిగి రోగికి ఒక వివరణాత్మక పరిశీలన చేయవలిసిన అవసరం ఉందని చెప్పారు.   పరిధీయ రక్త పరీక్ష ఫలితాలు: మోనోసైట్స్ (బృహత్‌ కేంద్ర శ్వేతాణువు) 28% (సాధారణ సంఖ్య 2 నుండి 8%) మరియు 6% బ్లాస్ట్ సేల్స్ (బ్లాస్ట్ జీవ కణములు( ఈ జీవాణువులు ఉండనే ఉండకూడదు)) .ఈ ఫలితాల ద్వారా దీర్ఘకాలిక మైలోమోనోసైటిక్ ల్యుకేమియా (ఒక విధమైన రక్త కాన్సెర్) ఉందని రోగనిదానము చేయబడింది. దీని కారణంగా రోగికి అల్లోపతి మందులు ఇవ్వబడినాయి. త్వరలోనే రోగికి తీవ్ర మైలాయిడ్ ల్యుకేమియా ఉన్నట్లుగా తెలిసింది. 2015 డిసెంబర్ 17  నుండి ఫిబ్రవరి 2016 వరకు రోగికి కీమోథెరపీ సెషన్లు (రసాయనచికిత్స) జరపటం జరిగింది. ఆ తర్వాత రోగికి వైద్యులు  బోన్ మారో (అస్తిమజ్జ) మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు తయారీ చేశారు. ఈ శస్త్రచికిత్స చేసేందుకు ఒక బోన్ మారో దాత యొక్క ఆవశ్యకత ఏర్పడింది. త్వరలోనే రోగి యొక్క సోదరి తగిన బోన్ మారో దాతయని నిర్ధారించ బడింది. దురదృష్టవశాత్తు, రోగికి ఒక ప్రమాదంలో కాలర్ ఎముక విరగడంతో, ట్రాంస్ప్లాంట్ శస్త్రచికిత్స  వాయిదా వేయబడింది. ఫిబ్రవరి 27 న చికిత్సా నిపుణులను సంప్రదించిన సమయంలో రోగి యొక్క జీవనశైలి మరియు ఆహార పద్దత్తులపై చేయవలిసిన మార్పులపై, చికిత్సా నిపుణులచే  సలహా ఇవ్వబడింది. ధ్యానసాధనము చేపట్టేందుకు రోగి ప్రోత్సాహించబడ్డారు. రోగి శస్త్రచికిత్స చేయించుకునేందుకు నిరాకరించి వైబ్రియానిక్స్ చికిత్సను ఎన్నుకున్నారు.

మార్చ్ 6 న , రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:

#1. NM2 Blood + NM96 Scar Tissue + SM13 Cancer + SM41 Uplift + SR264 Silicea + SR507 Lymphatic Organ + SR509 Marrow...TDS పది వారాలకు

#2. NM6 Calming + NM12 Combination-12 + NM25 Shock + NM45 Atomic Radiation + NM83 Grief + NM90 Nutrition + BR17 Male + SM5 Peace & Love Alignment + SM6 Stress + SM9 Lack of Confidence + SM14 Chemical Poison + SM26 Immunity + SR360 VIBGYOR + SR450 Willow + SR494 Haemoglobin + SR504 Liver + SR505 Lung + SR532 Sympathetic Nervous System...BD పది వారాలకు

నాలుగు రోజుల తర్వాత, రోగి రక్తంలో తెల్లరక్తకణముల సంఖ్య 11 శాతం ఉండేది. చికిత్స ప్రారంభించిన మూడు వారాల తర్వాత ఈ సంఖ్య 5.05 % కు తగ్గింది. మే లో చేయబడిన రక్త పరిశోధనలో సి.బీ.సి కవుంట్ సాధారణ స్థాయికి చేరుకుందని తెలుసుకున్న రోగి ఎంతో ఆనందించారు. ఇంత వేగంగా రోగికి నయంకావడం చూసిన వైద్యులు ఆశ్చర్యపడి రోగికి తిరిగి రక్త పరిశోధన మరియు ఎముక మజ్జకు సంబంధించిన పరీక్షలను చేయించడం జరిగింది.

మే 17 న #1 మరియు #2 ఆపబడినాయి.

రోగి యొక్క ఆరోగ్యం తిరిగి స్వస్థితికి చేరుకోవడానికి , క్రింది మందులు అతనికి ఇవ్వబడినాయి :

#3. NM6 Calming + BR23 Skeletal + SM24 Glandular + SM41 Uplift + SR504 Liver + SR509 Marrow + SR529 Spleen + SR532 Sympathetic Nervous System...BD నాలుగు వారాలకు 

చికిత్సా నిపుణులను రోగి క్రమం తప్పకుండా సంప్రదించడం కొనసాగిస్తున్నారు. చివరిగా 2016 నవంబర్ 14న జరిగిన సంప్రదింపు సమయంలో రోగి ఆరోగ్యంగా ఉన్నారు. తన ఆరోగ్యాన్ని తిరిగి అందించిన వైబ్రియానిక్స్ కు మరియు చికిత్సా నిపుణులకు రోగి తన కృతజ్ఞతలను తెలుపుకున్నారు.