మతిభ్రమ 11576...India
మతిభ్రమతో బాధపడుతున్న ఒక 13 సంవత్సరాల కుమారుడను తండ్రి చికిత్సా నిపుణుల వద్దకు తీసుకు రావడం జరిగింది. గత ఏడు నెలలుగా ఆ బాలుడు స్కూల్ కి వెళ్లేందుకు నిరాకరించడమే కాకుండా అప్పుడప్పుడు ఉదాసీనత మరియు ఉద్వేగానికి గురైయ్యాడు.
చికిత్సా నిపుణులను సంప్రదించడానికి పది నెలలు ముందు నుండి రోగికి ప్రవర్తనాపరమైన లక్షణాలు ప్రారంభమయ్యాయి. విజయవంతంగా సాగుతున్న తన తండ్రి యొక్క వ్యాపారం పూర్తిగా నష్టపోయిన 14 నెలలు తర్వాత ఇతనికి మతిభ్రమ సమస్య ప్రారంభమయింది. ఆ తర్వాత ఒక మతాచార్యుడు ఖురాన్ పారాయణ చేయడం ద్వారా కోలుకున్నాడు మరియు స్కూల్ కి తిరిగి వెళ్లడం ప్రారంభించాడు. అయితే రెండు నెలల తర్వాత అతను స్కూల్ కి వెళ్లడం తిరిగి మానేశాడు. రోగిని అనేక మనోవైద్య నిపుణులు మరియు వైద్యుల వద్దకు తీసుకు వెళ్లడం జరిగింది గాని రోగి చికిత్సకు సహకరించలేదు. అల్లోపతి మందులను తీసుకునేందుకు కూడా నిరాకరించాడు.
10 జనవరి రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
CC12.2 Child tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing + CC17.3 Brain & Memory tonic…TDS
వైబ్రో మందును తీసుకోవడం ప్రారంభించిన మరుసటి రోజు నుండి అతను స్కూల్ కి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. చాలా నెలల తర్వాత ఆ పిల్లవాడు స్కూల్ కి వెళ్లడం కుటుంభ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అయితే, పిల్లవాడు క్లాసులో హాజరయ్యే బదులు స్కూల్ కౌన్సెలర్ (సలహాదారులు) యొక్క ఆపీసు వద్ద నిరీక్షిస్తున్నట్లుగా చికిత్సా నిపుణులకు రోగి యొక్క కుటుంభం తెలియచేసింది. రోగికి ఇదే మందును ఇవ్వడం కొనసాగించమని కుటుంభ సభ్యులకు సలహా ఇవ్వబడింది. మరుసటి రోజు నుండి పిల్లవాడి ఆరోగ్య స్థితిలో 100% మెరుగుదల ఏర్పడింది. అప్పటినుండి అతను ఆనందగా ఉంటున్నాడు మరియు స్కూల్ కి క్రమం తప్పకుండా వెళుతున్నాడు. అతనికి ఏప్రిల్ 2016 లో వైబ్రో చికిత్సను తీసుకోవడం ఆపడం జరిగింది. 2016 ఆగస్టు లో అతను ఆనందంగా స్కూల్ కి వెళ్లడం కొనసాగిస్తున్నాడు.
రోగి యొక్క తండ్రి యొక్క వ్యాఖ్యానం:
మా కుమారుడి సమస్యను పరిష్కరించడానికి వైద్యుల సహాయం మాత్రమే కాకుండా మతాధికారుల సహాయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే మా కుమారుడి ప్రవర్తనలో మార్పు ఏర్పడలేదు. దైవ కృప మరియు వైబ్రియానిక్స్ మందుల ద్వారా మా అబ్బాయికి పూర్తిగా నయమైంది.
చికిత్సా నిపుణులు యొక్క వ్యాఖ్యానం:
పెండ్యులం స్కాన్ ద్వారా చేతబడి మరియు శాపాలు వంటి సమస్యలు ఉన్నట్లుగా తెలియడంతో రోగికి CC15.2 Psychiatric disorders ఇవ్వబడింది. ఇటువంటి సమస్యలున్న సందర్భాల్లో CC15.2 Psychiatric disorders అద్భుతమైన ఫలితాలను కలిగించే ఒక మిశ్రమమని ఖచ్చితంగా చెప్పవచ్చు.