ఆహార అలెర్జీ 03522...Mauritius
2015 మే లో ఆహార అలెర్జీలతో బాధపడుతున్న ఒక 46 ఏళ్ల వ్యక్తి చికిత్సా నిపుణులను సంప్రదించారు. ఐదేళ్ల క్రితం ఇతనికి కేండ్ ఆహారాల (తయారుచేయబడి డబ్బాలలో లభించే ఆహారం) అలెర్జీ మొదలయింది. ఈ ఆహారాన్ని తీసుకున్నప్పుడు, ఇతని చేతులు, మెడ మరియు చాతి పై దురదతో కూడిన ఎర్రటి మచ్చలు ఏర్పడేవి. రెండేళ్ల తర్వాత ఎండు పళ్ళు, గింజలు, కారం, పాల ఉత్పత్తులు మరియు గ్లూటెన్ మరియు ప్రిజర్వేటివ్లు (ఆహారాన్ని చెడిపోకుండా ఉంచే పదార్థాలు) వంటివి తీసుకున్నప్పుడు ఇతనికి ఇవే చర్మ సమస్యలు ఏర్పడడం మొదలయ్యాయి. 14 నెలల క్రితం, రోగి నోటిలోపల మరియు చిగుళ్ల పై చిన్న చిన్న గడ్డలు రావడం మొదలయింది. పైనున్న ఆహార పదార్థాలలో ఏ ఒక పదార్థాన్ని తీసుకున్నప్పటికీ రోగ లక్షణాలు తీవ్రమయ్యేవి. వైద్యుడు సలహా పై రోగి ఆహార అసహిష్ణుత (ఫుడ్ ఇంటోల్రన్సు) పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఇతనికి పైన ఇవ్వబడిన ఆహారా పదార్థాల అలెర్జీ ఉన్నట్లు రుజువైంది. అలెర్జీ కలిగించే ఆహార పదార్థాలను తీసుకోవడం నిలపడంతో అలెర్జీ సమస్య కొంత వరకు తగ్గింది. వైద్యుడుచే ఇవ్వబడిన ఆంటీ-అలెర్జిక్ అల్లోపతి మందులు, మౌత్ వాష్ మరియు లేపనం, ఇతనికి సహాయపడక పోయేసరికి వాటిని ఉపయోగించడం మానేశారు. 2015 మే 30 న చికిత్సా నిపుణులు రోగికి క్రింది మందులను ఇవ్వడం జరిగింది
దురద మరియు ఎర్ర మచ్చలకు:
#1. CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.7 Fungus...TDS
నోటిలో చిన్న గడ్డలకు:
#2. CC4.10 Indigestion + CC9.2 Infections acute + CC11.5 Mouth infections + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic...6TD
రెండు వారాల తర్వాత నోటిలో గడ్డలు 50% తగ్గినట్లు మరియు దురదతో కూడిన ఎర్ర మచ్చలు పూర్తిగా తొలగినట్లుగా రోగి తెలిపారు. రోగికి పాల ఉత్పత్తులు ద్వారా కలిగే అలెర్జీ పూర్తిగా తగ్గింది. దీని కారణంగా #1 యొక్క మోతాదును OD కి మరియు #2 యొక్క మోతాదు TDS కి తగ్గించబడింది. ఒక నెల తర్వాత, నోటిలో గడ్డల సమస్య 80% తగ్గిపోయింది. ఐదున్నర నెలల తర్వాత ,2015 నవంబర్ 14న, నోటిలో గడ్డలు పూర్తిగా తొలగిపోయినట్లుగా రోగి తెలిపారు. #2 మోతాదు ODకి తగ్గించబడింది. #1 యొక్క మోతాదు OWకి తగ్గించబడి, 2016 జనవరి లో ఆపబడింది. ఆహార అలెర్జీలు పూర్తిగా తొలగినందుకు రోగి ఎంతో ఆనందపడ్డారు. 2016 మే 30 న రోగికి అలెర్జీ సమస్య తిరిగి రాలేదు. ఇతను #2 మందును OD మోతాదులో తీసుకోవడం కొనసాగిస్తున్నారు.