మెడ బిర్రుగానుండుట (సెర్వైకల్ స్పాండిలైటిస్) 11569...India
2015 ఏప్రిల్ 6 న, నీరసం మరియు తీవ్ర నొప్పితో ఒక 62 ఏళ్ల వ్యక్తి చికిత్సా నిపుణులను సంప్రదించారు. గత పదిహేనేళ్లుగా ఈ వ్యక్తికి సెర్వైకల్ స్పాండిలైటిస్ సమస్య కారణంగా, ఉదయం మరియు రాత్రివేళల్లో రెండు భుజాలు,కాళ్ళు ,ముఖ్యంగా పిక్కలు నొప్పిగా ఉండేవి. ఎక్సరే పరీక్షలో రోగికి నడుమ కింద మరియు మెడ వద్దనున్న వెన్నెముకలో ఆస్టియోఫైట్లు ఉన్నట్లుగా తెలిసింది. రోగి కొంత ఉపశమనం కోసం ఇంటిలో రోజువారీ మాలీషు (మసాజు) తప్ప ఈ రోగ సమస్యకు ఇతర మందులను ఉపయోగించలేదు.
క్రింది మిశ్రమాలు రోగికి ఇవ్వడం జరిగింది:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS. ఈ మందులను రోగి ఆఫీసులో గోలీల రూపంలోను మరియు ఇంటిలో ఉన్నప్పుడు నీటిలోను తీసుకునేవారు. ఈ చికిత్సను ప్రారంభించిన తర్వాత రోగి మాలీషు చేయించుకోవడం నిలిపేశారు.
ఒక వారం తర్వాత, తన శక్తిస్థాయిలో గొప్ప మెరుగుదల ఏర్పడినట్లుగా రోగి తెలియచేశారు. అంతేకాకుండా తన భుజాల నొప్పి ఉదయం వేళలో 90% మరియు రాత్రివేళలో 50% మరియు కాళ్ళ నొప్పులు రెండు వేళల్లోనూ 50% తగ్గినట్లుగా తెలియచేశారు. రోగి యొక్క సౌకర్యం దృష్టిలో పెట్టుకొని మందు యొక్క మోతాదు 6TD కి పెంచబడింది.
ఎనిమిది వారాల తర్వాత, మే నెలలో, రోగి యొక్క భుజాల, కాళ్ళ నొప్పులు మరియు శక్తి స్థాయిలలో 90% మెరుగుదల ఏర్పడినట్లు రోగి తెలియచేశారు. దీని కారణంగా మందు యొక్క మోతాదు TDS కి తగ్గించబడింది. జూన్ నెలాఖరికి రోగికి 100% ఉపశమనం కలిగింది. జులై నెల మధ్యలో చికిత్సా నిపుణులు అందుబాటులో లేని కారణంగా రోగి వైబ్రో మందును తీసుకోవడం కొనసాగించలేకపోయారు. ఈ కారణంగా జులై నెలాఖరుకి నొప్పులు తిరిగి మొదలైనట్లుగా రోగి తెలియచేశారు.
TDS మోతాదులో తీసుకొనుటకు రోగికి వైబ్రో మందు పంపబడింది.
ఆగస్టు నెలఖారికి, తిరిగి 100% ఉపశమనం కలిగినట్లుగాను TDS మోతాదులో మందును కొనసాగిస్తునట్లుగాను రోగి తెలియచేశారు. కొన్ని రోజుల తర్వాత మరో వ్యాధి సమస్య కారణంగా హఠాత్తుగా రోగి ఆస్పత్రిలో చేర్చబడ్డారు. దీని కారణంగా వైబ్రో మందును తీసుకోవడం నిలపవలసివచ్చింది. అక్టోబర్ నెలలో రోగికి టైఫాయిడ్ మరియు టీ.బీ మెనింజైటిస్ (మేథో మజ్జా రోగం) వ్యాధులు ఉన్నట్లుగా నిర్ధారించ బడింది. ప్రస్తుతం ఈ రోగికి ఆస్పత్రిలో అల్లోపతి వైద్యం చేయించబడుతోంది.
2016 మే లో, భుజాలు మరియు కాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గినట్లుగా రోగి తెలియచేశారు.