తీవ్రమైన మలబద్ధకం 03526...USA
ఒక 15 ఏళ్ల అమ్మాయి దాదాపు ఐదు సంవత్సరాల నుండి తీవ్రమైన మలబద్ధకం సమస్యతో బాధపడేది. దీని కారణంగా కడుపు నొప్పి నుండి ఉపశమనం కొరకు ఆమె వైద్యుడను సంప్రదించడం జరిగింది. కానీ ఆమె తన కడుపు నొప్పి మలబద్ధకం సమస్య వలన కలుగుతోందని తెలుసుకోలేకపోయింది. ఆమెకు హెలికోబాక్టెర్ ఇన్ఫెక్షన్ ఉందని అనుమానించి, వైద్యుడు రోగికి ఆంటీబయాటిక్లను ఇచ్చారు. రోగి వైద్యుడను తిరిగి సంప్రదించిన సమయంలో వైద్యుడు చేసిన ఉదర పరిశీలనలో, ఆమె పేగులలో మలం పేరుకుందని గమనించారు. అనేక సార్లు ఆమెకు విరోచనకారి మందులను ఇచ్చినప్పటికీ, రోగికి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగింది. కడుపు నొప్పి మరియు కడుపు ఉబ్బుదలతో పాటు రోగికి తలనొప్పి సమస్య కూడా ఉండేది. రోగి యొక్క ముక్కు నుండి ఆమె యొక్క ఉదర భాగం వరకు ఒక గొట్టాన్ని అమర్చడం ద్వారా రోగి యొక్క ఉదర భాగంలో పేరుకున్న మలాన్ని తొలగించడానికి వైద్యుడు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సమస్యకు అల్లోపతి చికిత్స ద్వారా పూర్తి ఉపశమనం లభించడం సాధ్యం కాదని మరియు ఏదైనా ప్రత్యామ్నాయ చికిత్సా విధానాన్ని రోగికి చేయించమని వైద్యుడుచే సలహా ఇవ్వబడింది. రోగి యొక్క తండ్రిగారు ఒక సాయి భక్తుడి సిపార్సుతో చికిత్సా నిపుణుడను సంప్రదించడం జరిగింది. ఆ సమయంలో రోగి కడుపు నొప్పి మరియు ఉబ్బుదల సమస్యలతో బాధపడుతోంది. మొదటి సంప్రదింపు సమయంలో, ఒక ఆరోగ్యకరమైన జీవన శైలిని రోగి పాటిస్తున్నట్లుగా చికిత్సా నిపుణులు గమనించడం జరిగింది. అప్పుడప్పుడు ఆమెకు సైనస్ సమస్య వచ్చేదని మరియు శస్త్రచికిత్స ద్వారా రోగి యొక్క అడినాయిడ్లు (ముక్కుకును నోటికిని మధ్య పెరుగు కొయ్యగండలు) తొలగించబడ్డాయి. ఒక ఆధ్యాత్మికమైన కుటుంబం నుండి వచ్చిన ఈ రోగి, మానసిక చింతలు ఏమి లేని ఒక సంతోషమైన యువతియని నిపుణులు తెలుసుకున్నారు.
2016 జనవరి 17 న, చికిత్సా నిపుణులు క్రింది మందులను ఇవ్వడం జరిగింది:
CC4.4 Constipation + CC12.2 Child tonic…TDS రెండు వారాల వరకు
ఒక వారం తర్వాత, రోగి యొక్క తండ్రి, వైబ్రో చికిత్స ప్రారంభించిన రెండు రోజుల్లో, రోగికి ఉపశమనం కలిగినట్లుగా తెలియజేసారు. కడుపులో నొప్పి మరియు ఇతర రోగ సమస్యలు పూర్తిగా మాయమయ్యాయి. పైనివ్వబడిన మందులు మరొక వారం రోజుల వరకు TDS మోతాదులో కొనసాగించి, ఆపై నెల రోజులకు BD మోతాదులోను, ఆపై ఒక నెల వరకు OD మోతాదు లోను, రోగి తీసుకుంది. ఆపై ఆరు నెలల వరకు వారానికి ఒకసారి (OW) మందును తీసుకోవడం కొనసాగించింది.