పక్క తడపటం 11422...India
దీర్ఘకాలంగా పక్కతడిపే సమస్యున్న ఒక 11 సంవత్సరాలు వయసున్న అమ్మాయి యొక్క తల్లి 2014 ఆగస్ట్ 11న, వైబ్రియానిక్స్ చికిత్సా నిపుణుడను సంప్రదించింది. పది సంవత్సరాలు వయసునుండి, ఆ అమ్మాయి ప్రతిరోజు పక్క తడపటం ప్రారంభించింది. తనకి రాత్రి వేళ నిద్దురలో భయంగా ఉంటోందని ఆ బాలిక తెలియ చేసింది. తల్లి తండ్రులు ఈ విషయం పై రోగికి ఏ చికిత్సా చేయించలేదు.
చికిత్సా నిపుణుడు క్రింది మందులను తయారు చేసి ఇవ్వడం జరిగింది:
#1. CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC13.3 Incontinence + CC15.2 Psychiatric disorders…TDS
మూడు వారాల తర్వాత, పక్కతడిపే లక్షణం మరియు భయం 50% వరకు తగ్గిపోయాయని తెలియచేసింది. #1 మందును కొనసాగించమని అదనంగా ఒక మందు ఇవ్వదబడింది:
#2. NM21 KBS…TDS
ఒక వారం తర్వాత, #2 మందిచ్చిన రోజు నుండి పక్క తడపడం పూర్తిగా తగ్గిపోయిందని, రోగి యొక్క తల్లి తెలిపింది. భయం యొక్క తీవ్రత 75% తగ్గిపోయింది. #1 మరియు #2 ఆపై మూడు నెలల వరకు TDS మోతాదులో కొనసాగించడం జరిగింది.
నాలుగు నెలల తర్వాత 2014 డిసెంబెర్ లో, రోగికి భయం పూర్తిగా తగ్గిపోయింది. ఈ కారణంగా #1 మరియు #2 మందుల మోతాదును OD కి మరియు ఆపై ఒక నెల వరకు OW కి తగ్గించబడింది.
2016 ఫెబ్రవరిలో, ఈ బాలిక యొక్క తల్లి పక్క తడిపే సమస్య లేదా భయం తిరిగి రాలేదని తెలిపింది.