Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

సెగగుల్లలు (లైకెన్ ప్లానస్, ఒక చర్మ రోగము) 03507...UK


ఇరవై ఏళ్ళగా ఒక 62 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఒక సంకటమైన చర్మరోగంతో భాదపడుతున్నారు. 2015 నవంబెర్ 15న చికిత్సా నిపుణుడను సంప్రదించినప్పుడు, తనకి ఉన్నదీ విచర్చిక (సోరియాసిస్)  చర్మరోగమని చెప్పారు. రోగి యొక్క కాళ్ళు మరియు చేతులు గాయపుమచ్చలతో నిండియున్నాయి. రోగి యొక్క నుదుటి పైన కూడా ధద్దుర్లున్నాయి. అంతే కాకుండా రోగి యొక్క తలపై చర్మం కూడా చర్మవ్యాధి కారణంగా తెల్ల పొలుసులతో నిండియుంది. వీటి వల్ల కలిగే దురద కారణంగా ఈ వ్యక్తికి ఇబ్బందిగా ఉండేది. ఈ వ్యక్తి ఉపశమనం కొరకు అల్లోపతి, ఆయుర్వేదం మరియు హోమియోపతి వైద్యాలు తీసుకున్నారు కాని ఫలితం లభించలేదు. క్రింది మందులు రోగికి ఇవ్వబడినాయి:

విచర్చిక (సోరియాసిస్) చర్మరోగముకు:
#1. CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.6 Eczema + CC21.10 Psoriasis, స్వచ్చమైన ఆలివ్ నూనెలో ప్రతియొక్క మందును రెండు చుక్కలు వేసి కలపాలి. TDS, దద్దుర్లు పైన రాయాలి.

#2. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + #1…QDS

ఒక వారం తర్వాత దద్దుర్లు తగ్గాయి, అయితే రోగికి, ముఖ్యంగా రాత్రి వేళల్లో దురదలు ఎక్కువయ్యాయి. దీని కారణంగా రోగికి నిద్రపట్టేది కాదు. ఈ కారణంగా, మందు కలిపిన ఆలివ్ నునెను కేవలం ఉదయం వేళ మాత్రమే రాయమని, రాత్రి వేళ రాయడం నిలిపివేయమని రోగికి చెప్పబడింది. మూడు వారాల వరకు దురద తీవ్రంగా ఉండేది. పైగా తోటలో కొద్ది సేపు పనిచేశాక రోగి యొక్క వీపు,చేతులు మరియు కాళ్ళ చర్మం పై ఎర్రటి మచ్చలతో కూడిన దద్దుర్లు వచ్చాయి. రోగిని #1 పైపూత మందును ఆపివేసి, ఒక చర్మ నిపుణుడను సంప్రదించ వలసిందిగా చెప్పబడింది.  పరిశీలన తర్వాత వైద్యుడు, రోగికి ఉన్నదీ లైకెన్ ప్లానస్ (సెగగుల్లలు) అని, విచర్చిక చర్మరోగం కాదని (సోరియాసిస్) నిర్ధారించారు. దద్దుర్లు తగ్గెంత వరకు స్టీరాయిడ్ లేపనం వాటి పై రాయవలసిందిగా వైధుడు సలహా ఇచ్చారు. అయితే, రోగి స్టీరాయిడ్ లేపనాన్ని ఉపయోగించకుండా, వైబ్రో చికిత్సా నిపుణుడు వద్దకు చికిత్స కొరకు వచ్చారు. 2016 జనవరి 10న మందులను మార్చివ్వడం జరిగింది:

సెగగుల్లలు సమస్యకు:
#3. CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.6 Eczema,two drops ప్రతి మందును రెండు చుక్కలు 200 గ్రా సుగంధం లేని తేమ కలిగించే లెపనమున్న (మాయిశ్చరైసింగ్  క్రీమ్) సీసాలో కలపాలి…TDS, ధద్దుర్లపై రాయాలి.

#4. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + #3…QDS

ఒక వారం తర్వాత దురదలు పూర్తిగా తగ్గిపోయాయి. చర్మ వ్యాధిలో 60% ఉపశమనం కలిగింది- ఎరుపు పూర్తిగా తగ్గి, దద్దులు తగ్గడం ప్రారంభమయింది. రోగికి ఒత్తిడి పెరిగినప్పుడు లేదా రాత్రి వేళ టీవీ చూడడం కారణంగా విశ్రాంతి తీసుకోనప్పుడు, దద్దుర్లు తిరిగి వచ్చేవి. రోగిని క్రమ శిక్షణ పాటించమని, రాత్రి వేళ త్వరగా నిద్రించమని సలహా ఇవ్వబడింది. రెండు వారాల తర్వాత దద్దుర్లు పూర్తిగా తగ్గాయి. రోగి యొక్క వీపు మరియు కాళ్ళ పైనున్న దద్దుర్లు చాలా వరకు తగ్గాయి,అయితే, రోగి  చేతి గోళ్ళతో గోకడం కారణంగా కొన్ని చిన్న చిన్న పుండ్లు ఉండిపోయాయి. రోగికి  గోకరాదని సలహా ఇవ్వబడింది. ఆరు వారాల తర్వాత, 2016 మార్చ్ 7న రోగికి 100% నయమైంది. కొత్త దద్దుర్లు రావడం ఆగిపోయింది మరియు అంతకు ముందున్న దద్దుర్లు పూర్తిగా ఎండిపోయాయి. తలచర్మం పై పొరలు ఏర్పడడం ఆగిపోవడం గమనించిన రోగి ఎంతో సంతోష పడ్డారు. రోగికి, #4 ను ఆపై నాలుగు నెలల వరకు కొనసాగించమని, ఆ తర్వాత TDS కి తగ్గించమని చెప్పబడింది. రోగికి తేమ కలిగించే లేపనమును చర్మం పై రాయమని సలహా ఇవ్వబడింది.