దీర్ఘకాల మోకాలి కీళ్ళ నొప్పులు 02899...UK
2014 మే 2న, మోకాలి కీళ్ళ నొప్పులతో భాదపడుతున్న ఒక 58 ఏళ్ళ వ్యక్తి చికిత్సా నిపుణుడను కలవడం జరిగింది. అతని రోగ చరిత్ర: 11 ఏళ్ళ క్రితం, అతనికి తీవ్ర వీపు నొప్పి వచ్చినప్పుడు రైకి చికిత్స ద్వారా కోలుకున్నారు. గత మూడేళ్ళ నుండి, కొంత దూరం నడిచేసరికి అతనికి మోకాళ్ళలో తీవ్ర నొప్పి రావడంతో, తనకి కీళ్ళ వాతపు సమస్య మొదలైందని రోగి తలచారు. రోగికి కొన్ని సంవత్సరాల క్రితం కుడి మోకాలు నుండి ఒక గడ్డ తొలగించబడింది. బహుశా దీని కారణంగా కీళ్ళ నొప్పి మొదలై యుండవచ్చని రోగి తలచారు. నొప్పి నుండి తాత్కాలిక ఉపశమనం కొరకు, వైద్యుడి సలహా పై, అతను పారాసిటమోల్ లేదా ఇబుప్రోఫెన్ వంటి మందులను తీసుకొనేవారు.
రోగికి 2014 మే 9న, క్రింది మందులు ఇవ్వబడినాయి:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis...TDS
పుల్ అవుట్ కలిగే సంభావ్యత ఉందని ముందుగానే రోగికి చెప్పడం జరిగింది. చికిత్సను ప్రారంభించిన రెండు రోజుల తర్వాత, రోగికి పుల్ అవుట్ కారణంగా స్వల్ప అతిసారం కలిగింది. రోగికి సాదారణంగా కొంత దూరం నడిచిన తర్వాత వచ్చే నొప్పిలో 25% ఉపశమనం కలిగింది మరియు శక్తివంతంగా అనిపించింది. ఒక నెల తర్వాత, రోగికి మోకాలి నొప్పి 75% తగ్గిందని మరియు ఎక్కువ దూరం నడిచిన తర్వాత కూడా నొప్పి కలగడం లేదని తెలియచేసారు. నాలుగు నెలల తర్వాత రోగికి 100% ఉపశమనం కలిగింది. ఆపై రెండు నెలల వరకు రోగి TDS మోతాదులో వైబ్రో మందును కొనసాగించారు. ఆ తర్వాత, 2015 జనవరి నుండి మోతాదు తగ్గించ బడింది. రెండు నెలల వరకు మందును BD మోతాదులోను, ఆ తర్వాత రెండు నెలల వరకు OD మోతాదులో మరియు ఆపై ఆరు నెలల వరకు OW మోతాదులో తీసుకున్నారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో రోగికి కీళ్ళ నొప్పులు తిరిగి రాలేదు. 2015 అక్తోబెర్ లో చికిత్స నిలిపివేయబడింది. వైబ్రియానిక్స్ చికిత్స ప్రారంభించిన తర్వాత రోగి అల్లోపతి మందులను ఉపయోగించలేదు.
2016 జనవరిలో, ఒక కఠినమైన కృషి చేసినందువల్ల మరియు వాతావరణం చల్లగా ఉన్న కారణంగాను రోగికి కొంత నొప్పి కలిగిందని చికిత్సా నిపుణుడకు తెలియచేయడంతో, తిరిగి మందును OD మోతాదులో ప్రారంభించబడింది. కొద్ది రోజులలో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. పూర్తి ఉపశమనం కలిగినందుకు ఈ వ్యక్తి ఆనందం వ్యక్తం చేసారు. 2016 మార్చ్ నాటికి ఈ వ్యక్తి ఆరోగ్యకరంగా ఉన్నారు.