పెంపుడు పక్షి కాలికి గాయం 03516...Canada
2014 డిసెంబర్ మధ్యలో ఈ ప్రాక్టీషనర్ యొక్క 11 సంవత్సరాల ఆడ బడ్గి పక్షికి ఎడమ కాలికి గాయమయ్యి పంజరం లో నిలబడ లేక కదలలేక,పైకి ఎక్కలేని పరిస్థితిలో ఉంది. దీని కాళ్ళుమూసుకు పోయి చాపడానికి వీలుకాకుండా ఉన్నాయి. సహజంగా ఈ పక్షుల కు గల సాధారణ జీవిత కాలం 8 సంవత్సరాలను కూడా అది అధిగమించింది. దీని పరిస్థితి చూసి ఇది మరో మూడు వారాల కన్నా ఎక్కువ కాలం బ్రతకదని భావించారు. ఒక సంవత్సరం క్రితం ఇలానే మరో పక్షికి గాయం ఐతే వెటర్నరీ డాక్టర్ ఏమీ చేయలేక పోయారు, ఒక వారం తర్వాత అది మరణించింది.
2015 జనవరిలో వీరు వైబ్రియోనిక్ ప్రాక్టీషనర్ గా శిక్షణ పొందాక వీరి మొదటి పేషంటు ఈ పెంపుడు పక్షే. జనవరి 11 న క్రింది రెమిడి డానికి ఇవ్వడం జరిగింది :
CC1.1 Animal tonic ప్రతీ రోజూ అది త్రాగే నీటితో కలిపి ఇవ్వబడింది.
రెండు వారాల తర్వాత ఈ పక్షి మెల్లగా ధ్వనులు చేయడం,చిన్నగా కదలడం ప్రారంభించింది. నాలుగు వారాల తర్వాత దాని గాయమైన కాలును కష్టంగా కదల్చడం ప్రారంభించింది . మరొక నెలలో కాలును ఉపయోగించడం 95% మెరుగయ్యింది. 2015 మే నాటికి ఈ పక్షి తన రెండు కాళ్ళను ఉపయోగించి నడవడం పైకి ఎక్కడం చేయగలగడమే కాక చాలా చురుకుగా ఉండసాగింది. రెమిడి 2015 నవంబర్ వరకూ కొనసాగించబడింది. 2016 ఫిబ్రవరి నాటికీ ఇది ఏ సమస్యా లేక అరుస్తూ నడుస్తూ,ఆహారం తింటూ ఆనందంగా ఉంది.