మూత్ర విసర్జన ఆధీనములో లేకుండుట (ఎన్యురెసిస్) మరియు వత్తిడి 01480...France
గత 10 సంవత్సరాలుగా రాత్రిపూట పక్క తడుపుతున్న 12 సంవత్సరాల అబ్బాయిని అతని తల్లి ప్రాక్టీషనర్ వద్దకు తీసుకొని వచ్చారు. యితడు వత్తిడికి,ఆందోళనకు గురియవుతూ అప్పుడప్పుడూ కోపాన్ని కూడా ప్రదర్శిస్తున్నాడట. ప్రాక్టీషనర్ అతనికి క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది :
CC12.2 Child tonic + CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic…TDS
ఒక నెల తర్వాత బాబులో చెప్పుకోదగిన విధంగా ముఖ్యంగా భావోద్వేగాల పరంగా 30% మెరుగుదలను ప్రాక్టీ షనర్ గుర్తించారు. కనుక అదే రెమిడి ని కొనసాగించావలసిందిగా సూచించారు.
రెండు నెలల తర్వాత బాబుకు పక్కతడపడం 70% తగ్గడమే కాక మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు. కనుక ప్రాక్టీషనర్ అదే రెమిడి కొనసాగించ వలసిందిగా సూచించారు.
సంవత్సరము తరువాత బాబుకు ఒక్కసారికూడా పక్కతడిపిన దాఖలాలు లేవు.భావోద్వేగాలు విషయంలో కూడా ఈ సంవత్సరకాలంలో అతను ఒత్తిడికి గురియయిన ఒక్కసారి తప్ప మిగతా కాలమంతా ప్రశాంతముగా ఉండగలిగాడు .
ప్రాక్టీషనర్ వ్యాఖ్య :
ఆందోళన ,వత్తిడి,ధైర్యాన్ని కోల్పోవడం,వంటి సమస్యలకు CC15.1 Mental & Emotional tonic మరియు/లేదా CC15.2 Psychiatric disorders ఇవి అద్భుతంగా పనిచేస్తున్నట్లు గ్రహించారు.