Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

పునరావృత దీర్ఘకాలిక వినాళ గ్రంధుల వాపు (Chronic Recurrent Tonsillitis) 11567...India


2015 మార్చి 27 వ తేదీన 4 సంవత్సరములుగా తరుచుగా వచ్చే ఫోల్లికులర్ వినాళ గ్రంధుల వాపుతో బాధపడే 8½ సంవత్సరముల బాబును అతని తల్లి చికిత్సానిపుణుడి వద్దకు తీసుకొని వచ్చారు. నెలకు రెండు సార్లు వచ్చే ఈ వ్యాధి వచ్చినపుడు బాబు గొంతు నొప్పి, వాపు వల్ల ఏమీ మింగలేడు. దీని నిమిత్తం నెలకొకసారి అల్లోపతిక్ యాంటిబయోటిక్స్ తీసుకుంటున్నాడు.

2015 ఏప్రిల్ 3న క్రింది రెమిడితో అతనికి వైద్యం ప్రారంభమయ్యింది:

#1. CC12.2 Child tonic + CC15.1 Mental and Emotional tonic + CC19.7 Throat chronic…TDS

9 రోజుల వరకు బాబుకు యాంటిబయోటిక్స్ తీసుకోక పోయినప్పటికీ ఈ వ్యాధి లక్షణాలు తిరిగి రాలేదు. ఐతే ప్రాక్టీషనర్ మరొక సీనియర్ వైబ్రో నిపుణుడితో చర్చించి గతంలో వార్తాలేఖలో ఇటువంటిదే ఒక కేసులో (Chronic Tonsilitis10741…India, జూలై/ఆగస్ట్ 2014: సంపుటము 5, సంచిక 4) ఇచ్చిన రెమిడిని ఇచ్చారు:
#2. CC9.2 Infections acute + CC17.3 Brain and Memory tonic + #1…TDS

బాబుకు చక్కగా తగ్గిపోయి 2015 ఆగస్ట్ వరకు తిరిగి వ్యాధి తలెత్తక పోయేసరికి ఆ తల్లి బిడ్డల ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత బాబు తల్లి తన ఉద్యోగ బాధ్యతల్లో పడిపోయి మందు సక్రమంగా ఇవ్వకపోవడంతో బాబుకు ఆగష్టు 28న గొంతుమంట నొప్పి వచ్చాయి. బాబు తల్లి  #2 ను నీటితో పదినిమిషాల కొకసారి చొప్పున రెండు గంటల వరకు ఆ  తర్వాత వారం వరకు 6TD  ఇచ్చారు. 5 రోజులలో బాబు చక్కగా కోలుకున్నాడు. ఆ తర్వాత  #2…TDS. గా ఇవ్వబడింది.

2015 డిసెంబర్ 5న బాబు తల్లి 6 రోజుల క్రితం మందులు ఐపోయాయని కానీ తాను బిజీగా ఉండడంతో వెంటనే వచ్చి తీసుకోలేక పొయానని బాబుకు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు. ప్రాక్టీషనర్ అలా చెయ్యకూడదని గట్టిగా చెప్పి తిరిగి రెమిడి ఇచ్చిTDS. గా వాడమని చెప్పారు. 2015 డిసెంబర్ 20 నుండి BD గా డోసేజ్ ఇవ్వాలని నిర్ణయించారు. రెమిడి ఇచ్చిన నాటినుండి బాబుకు ఒక్కసారి కూడా యాంటిబయోటిక్స్ఇవ్వకుండానే పూర్తిగా తగ్గిపోవడంతో బాబు తల్లి వైబ్రియోనిక్స్ కు స్వామికి ఆనందంతో కృతజ్ఞతలు తెలియజేసారు.