Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దీర్ఘకాలిక నిద్రలేమి సమస్య 03532...UK


67 సంవత్సరాల వ్యాపారస్తుడు 10 సంవత్సరాల నుండి నిద్రలేమి సమస్యతో బాధపడుతూ నివారణ కోసం వచ్చాడు. అతను ఎప్పుడూ చురుకుగా ఉంటాడు, నడవడం, ప్రయాణం చేయడం అంటే అతనికెంతో ఇష్టం. రాత్రి పడుకోగానే ఆలోచనలు ప్రవాహంలా వచ్చేస్తూ ఉంటాయి. కొన్నిరాత్రులు ఆత్రుత, ఆందోళనతో నిద్రపట్టదు. అతను మెలటానిన్( Melatonin)మందును నిద్రకోసం అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటారు.

2015 సెప్టెంబర్ 19 వ తేదిన వీరికి క్రింది రెమిడి ఇవ్వబడినది:
#1. CC15.6 Sleep disorders…నీటితో నిద్ర పోవడానికి అర గంట ముందు.

మర్నాడు అతను మందు వేసుకున్నాక రాత్రి బాగా నిద్రపట్టింది తెల్లారి 7 గంటల వరకు మెలుకువ రాలేదు అని  చెప్పారు.

అక్టోబర్ 12 న  వారు తనకు 80 శాతం మెరుగయ్యిందని రాత్రిళ్ళు 6 నుండి 7 గంటల సమయం నిద్రపోతున్నానని చెప్పారు. పేషంటు చెప్పిన దాని ప్రకారము అతని ఆందోళన, ఆత్రుత, బిగ్గరగా మాట్లాడడం వీటికోసం ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు:  

#2. CC15.1 Mental & Emotional tonic + #1…ఇది మాత్రం తను ఇంతకుముందు మాదిరి వలె కొనసాగించాలి.

2015 నవంబర్ 17 వ తేదీన పేషంటు తనకు ప్రతీ రాత్రి 7 గంటల నిద్ర ఖచ్చితంగా పడుతోందని తన నిద్రలేమి వ్యాధి  100% తగ్గిపోయిందని చెప్పారు. మరో వారం డోస్ ను అదేవిధంగా కొనసాగించి తరువాత ఒక వారం పాటు 3TW  మరో వారం పాటు 2TW  అలా తగ్గించుకొంటురావలసిందిగా సూచించడమైనది.

పేషంటు వివరణ :
గత 10 సంవత్సరాలుగా నేను నిద్రలేమి సమస్యతో బాధపడుతూ జీవితం దుర్భరంగా మారి ఏ పనిమీద కూడాను ఏకాగ్రత నిలపలేని పరిస్థితి. రాత్రిళ్ళు నిద్ర పట్టక నాకు ఎదురయ్యే సమస్యలను ఎలా సాధించాలా అని పధకాలు వేసుకోవడం, ఉదయం  అవి కార్యరూపం దాల్చక నీరసించి పోవడం. ఇలాంటి స్థితిలో మొదటిసారిగా వైబ్రియో రెమిడి తీసుకున్నప్పుడు తెల్లవారి 7 గంటల వరకు మెలుకువే లేదు. నా జీవితంలో అంత బాగా ఎప్పుడూ నిద్ర పోలేదు. రోజుకు అతికష్టం మీద 4 గంటలు (అది కూడా అదృష్టం కలిసొస్తేనే) నిద్ర పోవడం స్థితి నుండి విబ్రియోనిక్స్ మందులు తీసుకున్నాక 100%నయమయ్యి రోజుకు 7 గంటలు హాయిగా నిద్రపోయే స్థితికి చేరాను. ఎప్పుడయినా రాత్రిళ్ళు మేలుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చినా ఆ తర్వాత త్వరగానే నిద్ర పడుతోంది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నిద్ర పోయే నాకు ఒక్కొక్క సారి ఉదయం 7.30 ఐనా మెలుకువ రాదు. నిద్ర లేచాకా ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటోంది. వైబ్రియో రెమిడి వల్ల మరలా పాత సమస్య ఎప్పుడూ తలెత్తలేదు.