అండాశయములో గడ్డ 10940...India
16 ఏళ్ళ అమ్మాయికి, అండాశయములో ఎడమవైపు క్లిష్టమైన కురుపు వున్నదని, ఆగస్టు 2015లో ఆమె గైనకాలజిస్ట్ నిర్ధారణ చేసారు. ఆమె గత 3నెలలుగా పొత్తికడుపునొప్పితో , ఒక పద్దతిలో రాని నెలసరి బహిష్టులతో బాధపడుతున్నది. గతనెల నుండి అతిసారవ్యాధితో రోజుకు 6 - 7 సార్లు నీళ్ళ విరేచనాలతో బాధపడుతున్నది. ఆమె వైబ్రో అభ్యాసకునితో తనకు ఆకలి బాగా తగ్గినట్లు, తక్కువ నీటిని త్రాగుతున్నట్లు, తనకు చైనీస్ ఆహారం తినడం ఇష్టమని చెప్పినది. 14 ఆగష్టు 2015 న, ఆమె క్రింది రెమిడీ ఇవ్వబడింది:
అండాశయములో గడ్డకు, క్రమబద్ధము కాని బహిష్టునకు:
#1. CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus + CC8.8 Irregular Menses…TDS
జీర్ణవ్యవస్థ సమస్యలకు:
#2. CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.8 Gastroenteritis…TDS
రోగికి రోజుకు 2-3 లీటర్ల నీటిని త్రాగమని, అధిక పీచుగల ఆహారాన్ని తినమని, చైనీస్ ఆహారాన్ని మానేయమని సలహానిచ్చిరి. 2వారాల చికిత్స తర్వాత (28 ఆగస్టు 2015) ఆమె తన రోగలక్షణాలు 60% తగ్గినట్లు, నీళ్ళ అతిసారము కూడా రోజుకు 2-3 సార్లకు తగ్గినట్లు చెప్పింది. ఆమె బహిష్టు ప్రారంభంలో, కొన్ని చిన్నగడ్డలు రక్తంతో బయటకు వచ్చాయని చెప్పినది. పెద్దగా మెరుగుపడని అతిసారమును దృష్టిలో వుంచుకుని #2 వ రెమిడీ ని ఈ విధముగా మార్చిరి:
#3. CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea…TDS
2 సెప్టెంబర్ 2015న మళ్ళీ వైద్యపరీక్ష చేయగా, అండాశయములో గడ్డ పోయినట్లు తెలిసినది. మరో 2 వారాలలో అతిసారం తగ్గినది. కనుక #3 నుయిట్లు మార్చారు:
#4. CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.10 Indigestion tonic…BD అంతేకాక, #1 కూడా BD కి తగ్గించబడినది. 2015 అక్టోబర్ కి, అమ్మాయి పూర్తిగా కోలుకున్నది. నిర్వహణ మోతాదుగా #1 మరియు #4 ను మాత్రం తీసుకొంటున్నది.