Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

బాధతో అండోత్సర్గము, బహిష్టుకు ముందు బాధ, బాధపూరిత ఋతుక్రమం 03520...USA


21 మార్చి 2015న 28ఏళ్ల మహిళ బాధాకరమైన అండోత్సర్గము (బహిష్టు కాల మధ్యలో ఏర్పడు నొప్పి), బహిష్టుకుముందు బాధ, బాధాకరమైన బహిష్టు నివారణకై చికిత్స కోరివచ్చింది. ఈ మూడింటికలయికతో ఆమెకు విపరీతమైన బాధ కలుగుతోంది.       ఆమె గత 6-7 ఏళ్లుగా నెలసరి మధ్యలో కడుపుఉబ్బరం, వికారం, కడుపులో పోట్లు, తుంటినొప్పి లక్షణాలతో అండోత్సర్గము నొప్పిని భరిస్తోంది. గత 2ఏళ్లుగా రోజుకు పలుసార్లు అండోత్సర్గము జరుగుతోంది. ఆ లక్షణాలన్నీ 2014 నుండి మరింత ఘోరంగా మారాయి. ఉపశమనం కోసం, ఏంటిఇన్ఫ్లమేటరీ నప్రోక్సీన్ (anti-inflammatory Naproxen) తీసుకుంది. నొప్పి భరించలేనప్పుడు ఆమె ఉదరంమీద వేడి కాపును ఉపయోగించింది. తొలిసారి రజస్వలయినది మొదలు, ప్రతినెల బహిష్టుకు 2-3రోజుల ముందునుంచి కడుపు వుబ్బరం, అక్రమపద్దతిలో వుష్ణం, శీతల ప్రభావాలు, శీఘ్ర నాడి, మెట్లెక్కుతున్నప్పుడు ఆయాసంతో బాధపడుతోంది. ఈ లక్షణాలు ఋతుక్రమం వచ్చుటకు 3 - 4 రోజులు ముందుగా మొదలై, చివరవరకు కొనసాగుతున్నవి.

ఋతుక్రమం ముందు రోజు, ఆమె కడుపులో నొప్పి వస్తుంది. మొదటిరోజు చాలా తీవ్రమైన కడుపునొప్పితోపాటు మొటిమలు, వికారం, కడుపుబ్బరం, సున్నితమైన రొమ్ములు వంటి అదనపు లక్షణాలతో బాధపడుతుంది. మొదటిరోజున ఆమెకు నడవలేనంత ఘోరమైన నొప్పి వుంటుంది. చాలాసార్లు ఆమె నొప్పి నివారణకు మాత్రలు తీసుకుని, 3 గంటల్లో తగ్గుతుందేమోనని ఎదురు  చూస్తుంది. 2014 వేసవినుండి, ఈ మొదటిరోజు బాధలక్షణాలు 4వ రోజున తిరిగి వచ్చేవి. అభ్యాసకుడు సిద్ధంచేసిన రెమిడీ:

నొప్పితోకూడిన అండోత్సర్గమునకు: 
#1. CC8.4 Ovaries & Uterus + CC8.7 Menses frequent + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.2 SMJ pain…TDS 9వ రోజు మొదలెట్టి, అండోత్సర్గము నాటివరకు

బహిష్టుకు ముందు బాధ, బాధపూరిత ఋతుక్రమం కొరకు:
#2. CC8.6 Menopause + CC8.7 Menses frequent + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...TDS ఋతుక్రమం మొదలయేముందు 4రోజుల ముందు నుంచి ఋతుక్రమం 5వ రోజువరకు. రోగలక్షణాలు వుంటే, ప్రతి 10నిముషాలకు ఒక మోతాదు చొప్పున 1 లేక 2 గంటలవరకు తీసుకొనవలెను. 

రోగి 9 వరోజున బాధాకరమైన అండోత్సర్గము కోసం చికిత్సను ప్రారంభించి, అండోత్సర్గము ముందు 4-5 రోజులు తీసుకొనినది. ఈసారి ఆమెకు విపరీతమైన వికారం, కడుపుబ్బరం కలగలేదు. 13వ రోజు అండోత్సర్గము రోజున, ఒకసారి వికారం, వుబ్బరం అనిపించినను, ఆమె తుంటినొప్పి కాని కడుపునొప్పి కాని అనుభవించలేదు. ఇది తక్షణమైన గొప్ప మెరుగుదల.

14 వరోజున, ఆమె ఆఖరు మోతాదు #1 తీసుకున్నది. ఆమె #2 మందు మొదలెట్టక పూర్వం , వైద్యుడు #1 and #2 ను కలిపి పరిహారమునిచ్చిరి:

#3. #1 + #2...TDS నీటితో తీసుకోవాలి.

ఈ చికిత్స యొక్క ప్రభావం సమానంగా జరిగింది. 4 జూన్ 2015 న, రోగికి తన 2వ రుతుక్రమం పూర్తయినది. కానీ ఆమెకు పూర్వపు ఉష్ణత, శీతలం, తీవ్రనాడి, శారీరక శ్రమ, సున్నిత ఛాతీ, ఆయాసం వంటి లక్షణాలేమీ కలగలేదు. ప్రస్తుత రోగి లక్షణాలు-మొటిమలు, వికారం (95% తగ్గినది), నొప్పి, పోటు (90% తగ్గినవి). మొదటి 2రోజుల్లో వుబ్బరం, త్రేనుపులు 10% మాత్రమే తగ్గినవి.

రోగి  #3 తీసుకుంటుండగా, కడుపునొప్పికాని, కటినొప్పి (90% మొత్తం మెరుగుదల) కాని అనుభవించకుండానే, ఒకసారి అండోత్సర్గం జరిగినది. ఆమెకు వికారం (95% మెరుగైనది) కూడా తెలియలేదు. ఇతర లక్షణాలు కూడా బాగా తగ్గాయి. చికిత్స ప్రారంభించుటకు ముందు అనేకసార్లు వచ్చిన కడుపుబ్బరం, యిప్పుడు ఒకసారి లేదా రెండుసార్లు వచ్చింది. 14వ రోజున ఒకటి లేక రెండుగంటలు మాత్రమే రోగి తనకడుపు ఉబ్బినట్లు భావించిరి.

ఆటైములో రోగి చాలా ప్రయాణిస్తుండటం ఈ వైబ్రో పరిహారం యొక్క సత్ప్రభావమునకు నిదర్శనం. ప్రయాణంలో సాధారణంగా ఆమె రోగలక్షణాలతో భరించలేని బాధపడేది కానీ రోగి ప్రకారం, నివారణలు ఆమెకు అద్భుతంగా సహాయపడినవి. రోగి ఋతుస్రావం ముందు బాధలు తగ్గుటకు వాల్ నట్స్ తీసుకున్నది, అట్లే ఉబ్బరం నుండి ఉపశమనం కోసం అరటిపళ్ళు తిన్నది.

అక్టోబరు 9, 2015న రోగి పురోగతిని వెల్లడించేరు. అండోత్సర్గము నొప్పి లక్షణాలలో మెరుగుదలలు - వుబ్బరం (90% మెరుగు), స్పాటింగ్ (95% మెరుగు), తుంటినొప్పి, కడుపు నొప్పి (98%మెరుగు), వికారం (100%మెరుగు) అయినవి. రుతుక్రమం ముందు, తర్వాత బాధలలో వుబ్బరం (90%మెరుగు), వికారం, కడుపునొప్పి (95%మెరుగు), మిగతా రోగలక్షణాలు (100%) మెరుగయినవి.

నవంబర్2015 నాటికి, మోతాదు BDకి తగ్గించి, ఒక నెల వాడుటకు యిచ్చిరి. ఆతరువాత అభ్యాసకుడు రోగిని సంప్రదించి, పరీక్షించి, ఆ నెలలో వచ్చిన మార్పులు, మెరుగుదలనుబట్టి చికిత్స నిర్ణయించి కొనసాగిస్తారు.

రోగి వ్యాఖ్య:

నేను 2013 సం. మధ్యలో నా ఋతుక్రమ సంబంధితసమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నట్లు గమనించేను. నెలసరి మధ్యలో నేను రక్తం చుక్కలు చూసినప్పుడు, కడుపు నొప్పి రావడంతో చాలా భయపడ్డాను. నేను అల్ట్రాసౌండ్, పాప్ స్మియర్ పరీక్షలు చేయించుకున్నా, ఫలితాలలో ఎట్టి సమస్య కనిపించలేదు. నా గైనకాలజిస్ట్ నా రోగలక్షణాలు ఋతుక్రమం మధ్యలో కలిగే ఒక జబ్బు అని, Naproxen analgesic ను వాడమన్నారు. కానీ దాన్ని సంవత్సర కాలంగా వాడుతున్నా, నొప్పి తగ్గించే మాత్రలను అధిక సంఖ్యలో వాడవలసివచ్చింది.

అప్పుడు నేను వైబ్రో వైద్యురాలిని కలిసి, ఆమెద్వారా విబ్రియోనిక్స్ థెరపీ గురించి తెలుసుకున్నాను. నేను సహజ చికిత్సలని బాగా నమ్ముతాను. కనుక నేను వైబ్రో వైద్యురాలి నివారణలతో నా ఆరోగ్యపరిస్థితిని మెరుగుచేసుకోవాలని నిర్ణయించుకున్నాను.

నేను ఇప్పుడు గత 6నెలలుగా వైబ్రోపరిహారం ఉపయోగిస్తూ, వైద్యురాలి సూచనలమేరకు ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తున్నాను. నా లక్షణాలు 95% వరకు మెరుగయినవి. నేను నా బాధాకరమైన పరిస్థితిని యింత అద్భుతంగా మెరుగుపరచిన వైద్యురాలికి, వారి వైబ్రియోనిక్స్ పరిహారాలకు చాలా కృతజ్ణురాలిని. నేను అనారోగ్యబాధలు అనుభవిస్తున్నవారికి, యితర వైద్యవిధానాలకు వెళ్ళేముందు, వైబ్రియోనిక్స్ చికిత్స పొందవలసినదిగా సిఫార్సు చేస్తున్నాను.