తీవ్రమైన నిస్పృహ, నిరాశ 03503...UAE
ముంబైకి చెందిన 60 ఏళ్ల స్త్రీ దుబాయ్ లోనున్న కుమార్తెని చూచుటకు వచ్చినప్పుడు, జనవరి 21, 2015 న అభ్యాసకుని వద్దకు ఆపుకోలేనివిధంగా ఏడుస్తూ వచ్చారు. గత 21 సం.లు.గా, ఆమె తీవ్రమైన నిరాశ, నిస్పృహలతో బాధపడుతున్నట్లు, ఆమె కుటుంబం వివరించింది. ఆమె మనసును శాంతపరచే (anti-depressants) మందులు తీసుకోగా, కొంత నయమైంది కానీ ఆమెసోదరుడు క్యాన్సర్ తో అకస్మాత్తుగా మరణించినందువల్ల, గత 9 సం.లు.గా ఆమె మానసికరోగం అధ్వాన్నంగా మారింది. ముఖ్యంగా ఉదయం 9గం.ల.నుండి మధ్యాహ్నం 2 గంటలవరకు ఆమె విపరీతంగా ఏడుస్తుంది. 2గం.ల. తర్వాత ఆమె కొద్దిగా మెరుగవుతుంది. ఆమె ఊహించని విధంగా కాన్సర్ తో సోదరుని మరణంవల్ల, అదేసమయంలో వివాహంవల్ల దూరమైన తనకుమార్తె ఎడబాటువల్ల ఆమెకు చావు అంటే భయం ఏర్పడి ఆమె అంతులేని నిరాశకు గురయింది. ఆమె 20మిల్లిగ్రామ్ ఫ్లూడక్ (fluoxetine, an SSRI inhibitor)ప్రతి రోజు కాస్త వూరటకొరకు తీసుకొంటున్నారు. ఆమెకు మధుమేహం, అధిక రక్తపోటు, మరియు ఆమె కాళ్ళలో నరాలపోటు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వున్నవి. ఇవి అల్లోపతి మందులవల్ల (Diamicron MEX 500 OD, Amlodipine, and Combiflam 400mg) నియంత్రించబడ్డాయి. 21 సం.ల ముందు, ఆమెకు క్షయవ్యాధి వచ్చింది. గర్భాశయాన్నికూడా తొలగించిరి. రోగి నిరాశకు ఈ క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC8.1 Female tonic + CC8.6 Menopause + CC10.1 Emergencies + CC15.1 Mental and Emotional tonic + CC15.2 Psychiatric disorders…6TD చొప్పున 7 రోజులవరకు, తర్వాత QDS
రెమిడీ ప్రారంభించిన 3రోజుల్లో, రోగికి 50% మెరుగుదల కలిగి, ఏడవటం మానివేసారు. 5రోజుల తర్వాత, ఆమెకు 80% నయమైనందున anti-depressants తీసుకోవడం నిలిపివేసారు. 19వరోజున, నిరాశగా వుండే సమయం గంటల నుండి నిమిషాలకు తగ్గి, పూర్వం ఏడుపు సమయం గతంలో 3-4 గంటలబదులు, యిప్పుడు 5నిముషాలకంటే తక్కువలో వుంటున్నవి. చాలా త్వరగా మామూలు స్థితికి రోగి వస్తున్నారు. 4 వారాలలో, రోగికి 100% మెరుగయినది. 9నెలల తర్వాత, ఆమె ఆరోగ్యం నిలకడగా వుంటున్నది. వ్యాధి లక్షణాలు తిరిగి రావచ్చుననే భయంతో, ఆమె ఆపకుండా QDS గానే రెమిడీ కొనసాగిస్తోంది. అభ్యాసకుడు రోగిలో మరింత విశ్వాసం కలిగేవరకు, తరచుగా పరిశీలిస్తూ, రోగిని గమనిస్తూ, క్రమంగా OW కు మోతాదుని తగ్గించడానికి నిర్ణయించుకు కున్నారు.
రోగి కుమార్తె వ్యాఖ్యలు:
వైబ్రియోనిక్స్ మా అద్భుతమైన మిత్రుడు. ప్రతిరోజు వుదయం 9గం. నుండి మధ్యాహ్నం 2గం. వరకు మాఅమ్మ పెద్దగా ఏడుస్తుంటే చూడలేక బాధగావుండేది. ఆమె చంటిపాపలా, దగ్గరలో వున్నవారిని పట్టుకొని ఏడుస్తుండేది. వైబ్రియానిక్స్ చికిత్స తీసుకున్న 2వ రోజు నుండి ఆమె మెరుగైంది. 4వ రోజునుండి నేనెరిగిన, ఆనందంగావుండే అమ్మ నాకు తిరిగి దక్కింది. ఆమె మాతో సంతోషంగా నవ్వుతూ, హాస్యంగా మాట్లాడుతూ మా ఇంట్లో సుఖంగా వుంటోంది. సాయిమాత మాఅమ్మను, మా కుటుంబాన్ని ఆశీర్వదించారు. మేము వైబ్రో చికిత్సకు చాలా కృతజ్ఞులం. మేము మా వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ ఈ సేవను ఇలాగే కొనసాగించాలని ప్రార్థిస్తున్నాము.