ఊపిరితిత్తుల అలెర్జీలు 11278...India
62 ఏళ్ల శారీరకంగా చురుకైన అభ్యాసకుడు, గత 10 సం.లుగా దుమ్ము, ఘాటువాసనలకు అలెర్జీతో, తుమ్మటం, నిరంతరం ముక్కు దిబ్బడతో బాధపడుచున్నారు. 2000 సంవత్సరం నాటికి, అతను దాదాపు ప్రతిరోజూ అలెర్జీ అల్లోపతిక్ ఔషధం తీసుకునేవారు. అతని మధుమేహం స్వల్పంగా పెరిగింది కాని అతను దానికి చికిత్స తీసుకొనుటలేదు. జనవరి 2010 నాటికి అతని రక్తంలో చక్కెర స్థాయి సాధారణస్థాయికన్న పైకి చేరుకున్నాయి (ఉపవాసం: 150mg / dl మరియు భోజనం తర్వాత: 200mg / dl) మరియు తేలికపాటి రక్తపోటు (140/80) కూడా అతనికి వున్నట్లు నిర్ధారణ జరిగింది. అతనికి మధుమేహం మందు (భోజనం ముందు Diamicrox R-6 OD), ఒక రక్తపోటు మందు (Cardace 2.5 mg BD) యివ్వబడింది. జనవరి 15, 2010 న అల్లోపతి మందులతో పాటు క్రింది వైబ్రియోనిక్స్ చికిత్సను తనకు తనే ఆరంభించినాడు:
ఊపిరితిత్తుల అలెర్జీలకు:
#1. CC9.2 Infections acute + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic…TDS
మధుమేహమునకు:
#2. CC6.3 Diabetes + CC15.1 Mental & Emotional tonic…BD, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం తర్వాత
అధిక రక్తపోటునకు:
#3. CC3.3 High Blood Pressure (BP) + CC12.1 Adult tonic…TDS
తరువాతి 3 నెలల్లో, అతని అలెర్జీ వలన ఏర్పడే ఇబ్బందులు క్రమంగా తగ్గుతూ 3 నెలలు పూర్తయ్యే సమయానికి, అతని అలెర్జీలు పూర్తిగా నయమైనవి. అతని రక్తపోటు సాధారణమైనది (110/70), అందువలన వైద్యుడు కార్డియాస్ (Cardace)యొక్క మోతాదును BD నుండి OD కు తగ్గించారు. అభ్యాసకుడు తదుపరి 5 ½ సంవత్సరాలలో సెప్టెంబరు 2015 వరకు #1 ను తీసుకోవడం కొనసాగించారు. ఈ సంవత్సరాలలో అలెర్జీలు ఎప్పుడూ తిరిగి రాలేదు. అతను నవంబర్ 2015 నాటికి అలెర్జీలు లేకుండా ఉన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు కోసం అలోపతి మందులతో పాటు, అదనంగా #2 మరియు #3 తీసుకుంటున్నారు.
సంపాదకుని గమనిక:
రోగి అన్నిలక్షణాలను పోయినట్లు భావించిన వెంటనే #1 కోసం తగ్గింపు విధానాన్ని అనుసరించవలెను