వుబ్బసం, పడిశం, ఫ్లూ 03503...UAE
29 నవంబరు 2014 న, 50ఏళ్ల వ్యక్తి, తనకు 8ఏళ్ళ వయస్సునుండే వున్న ఉబ్బసవ్యాధి, ప్రతిఏడు చలికాలంలోవచ్చే జలుబు లేదా ఫ్లూ లకు చికిత్సకొరకు వచ్చారు. గత 5 సం.ల. లో, అతను ప్రతీఏడు 1 - 2 నెలలపాటు ఉబ్బసం కాక జలుబుతో కూడా బాధపడుచున్నారు. అతడు తరచూ రెండు వేర్వేరు కోర్సుల ఆంటీ బయోటిక్స్ ఈబాధల కొరకు తీసుకున్నారు. చలికాలం సమీపిస్తుండటంతో, అతడు ఇప్పటికే వుబ్బసం దాడులతో బాధపడుతూ, అతను 'వెంటోలిన్' ఇన్హేలర్ కనీసం 3 - 4సార్లు రోజుకు ఉపయోగిస్తున్నారు. అతన్ని చూసినప్పుడు, అతనికి పడిశం లక్షణాలు లేవు అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
వుబ్బసం కొరకు:
#1. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.1 Chest tonic + CC19.4 Asthma attack…TDS
చికిత్స మొదలైన 3 రోజులలో, పుల్లౌట్ కారణంగా రోగి తలనొప్పితో, అలసటతో బాధపడ్డారు. 5వ రోజున అతను వుబ్బసం బాధ 50% తగ్గినట్లు భావించారు. 10 రోజుల్లో, వుబ్బసవ్యాధి తగ్గిపోయింది మరియు అతను ఇన్హేలర్ను ఉపయోగించడం నిలిపివేశారు. ఈసమయంలో రోగి తీవ్రమైన దగ్గు, గొంతునొప్పి, పడిశం / ఫ్లూ లక్షణాలు ఏర్పడ్డాయి. అతను తన అల్లోపతి వైద్యుడి వద్దకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
పడిశం, ఫ్లూ కొరకు:
#2. CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC19.1 Chest tonic + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic…6TD in water
5వ రోజు నాటికి, రోగికి గొంతునొప్పి, తుమ్ములు, ముక్కు కారడంలో 100% మెరుగుదల కలిగింది. ఐనప్పటికీ, దగ్గు, ఛాతీ వత్తిడి 10 రోజుల తరువాత మెరుగు లేకుండా కొనసాగింది. ఒక లోతైన అంతర్లీన కారణాన్ని అనుమానిస్తూ, అభ్యాసకుడు పరిహారంను మార్చిరి:
#3. CC9.3 Tropical diseases + #2…6TD in water
రోగి 3 రోజులు తీవ్రమైన పుల్లౌట్ కారణంగా బాధ అనుభవించారు. అతనికి అలసట అదేపనిగా నిద్ర వస్తున్నట్లు అనిపించినా, రెమిడీ కొనసాగించడానికి నిశ్చయించుకున్నారు. 4వ రోజు నుండి, అతని దగ్గు 40% మెరుగుపడింది. 7వ రోజుకి దగ్గు, ఛాతీ వత్తిడి తగ్గిపోయి, అతను పూర్తిగా కోలుకోవడం జరిగింది. రోగి 2 వారాలపాటు తక్కువ మోతాదులో TDS, తర్వాత మరోవారం OD కు తగ్గించి చికిత్సను కొనసాగించారు. అక్టోబరు 2015 నాటికి ఆయన కోలుకున్న 8 నెలలనుండి, అతనికి వుబ్బసం కాని జలుబు / ఫ్లూ కాని తిరిగి రాలేదు. అతనికి ఛాతీలో కూడా వత్తిడి ఏదీ లేకుండా ఆరోగ్యంగా వుంది.
ప్రాక్టీషనర్ యొక్క వ్యాఖ్యలు:
ఈరోగి పూర్తిగా స్వామి దయవల్లనే కోలుకున్నారు. సాయి విబ్రియోనిక్స్ కి, అతను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అతను నా వద్దకు అనేకమంది రోగులను పంపినారు. మాదేశంలో 3 విబ్రియోనిక్స్ శిబిరాలను నిర్మాణ కార్మికుల కొరకు నిర్వహించడంలో కూడా సహాయపడ్డారు.