పుప్పొడివల్ల సంక్రమించిన జ్వరం 03507...UK
జూన్ 6, 2015 న 42 ఏళ్ల టీవీ మెకానిక్, పుప్పొడిమూలంగా వచ్చే జ్వరం (Heyfever) లక్షణాలతో వైబ్రో అభ్యాసకునివద్దకు వచ్చారు. బాల్యంనుండి అతను దీనివల్ల బాధపడుచున్నారు. అతను తనకి 10 ఏళ్ల వయస్సులో, తండ్రి తనని పొలాలలో గుర్రాలను చూడటానికి తీసుకెళ్లినప్పుడు, మొదట ఈ జ్వరం ప్రారంభమైనదని చెప్పారు. నాటినుండి అతను ప్రతీ వసంతఋతువులో, వేసవిలో నీళ్ళూరే కళ్ళు, నీళ్ళు కారే ముక్కుతో ఈ పుప్పొడి జ్వరంతో, సుస్తీగా, ఆందోళనలతో బాధపడుతున్నారు. అతను వివిధ (antihistamines) అలెర్జీ మందులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇప్పుడు అతను ఏ మందులు వాడటంలేదు. ఆయనకు ఇవ్వబడిన చికిత్సా రెమిడీ:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis...TDS
నీటిలో మొదటి మోతాదు నేరుగా రోగి నాలుకక్రింద ఉంచబడింది. 2 నిముషాల తరువాత, రోగి మాట్లాడుతూ, మందు నిష్ప్రయోజనమని (daft), అనిపించినను, అప్పటికే తనకు మెరుగుదల కనిపిస్తున్నట్లు రోగి చెప్పారు. అతను లోపల ప్రశాంతంగా వున్నదన్నాడు. ఆందోళన తగ్గింది. అర్ధగంట తర్వాత అతను బాగా మెరుగైనట్లు భావించాడు! అతను నీరుకారే ముక్కు నయమై, ఎగబీల్చుట ఆగింది. 2వారాలతర్వాత, రోగి రోజుకు 2సార్లు మాత్రమే రెమిడీ తీసుకుంటున్నట్లు చెప్పారు. స్వల్పంగా పాతలక్షణాలు వచ్చినా, కొన్ని నిమిషాలలో తగ్గిపోతున్నవి. మేఘావృతమైన రోజుల్లో, పుప్పొడి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అతనికి రోగలక్షణాలు హెచ్చుతున్నవి. అప్పుడు వైబ్రో పరిహారంకూడా ప్రభావం చూపదు. తీవ్రదాడుల వేళలో, మోతాదు 6TD కి పెంచమని, రోజులో మొదటి మోతాదుతో సహా, ప్రతి 10 నిమిషాలకొకసారి చొప్పున 2 గంటలపాటు తీసుకోమని రోగికి సలహా ఇవ్వబడినది.
3వారాల తరువాత, రోగి తనస్థితిలో మార్పేమిలేదని చెప్పారు. తర్వాత సంప్రదింపులో, రోగి పనివద్ద వున్నప్పుడు మందు తీసుకోవడం కష్టంగావున్నట్లు అభ్యాసకుడు తెలుసుకున్నారు. రోగి చాలాకష్టమైన పద్ధతిలో, వారంలో 7 రోజులు పనిచేస్తూ, కొన్నిసార్లు చాలారాత్రి వరకు పనిచేస్తున్నారు. అభ్యాసకుడు ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి రోగితో మాట్లాడారు. ఉదయం, సాయంత్రం, ఒత్తిడిని తగ్గించడానికి, అతని జీవితంలో మెరుగైన సంతులనాన్ని సాధించడానికి పద్ధతులు, శ్వాసవ్యాయామాల గురించి సలహా యిచ్చారు. దురదృష్టవశాత్తు అక్టోబర్ 2015 నాటికి, అభ్యాసకుడు రోగినుండి ఎటువంటి సమాచారం పొందలేదు.
సంపాదకుని గమనిక:
సిఫార్సు చేసిన మోతాదుప్రకారం రెమిడీ వాడనిచో వైబ్రో చికిత్స ప్రభావం చూపదు.