దీర్ఘకాల పార్శ్వనొప్పి, అజీర్ణం, భయాందోళనలు, అవయవాల్లో నొప్పి 03507...UK
30 ఏళ్ల మహిళ తన వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స కోరి వచ్చారు. ఆమె చాలా సం.ల.నుండి పార్శ్వపు నొప్పితో, ఆమ్లప్రభావం వల్ల అజీర్ణవ్యాధి, తేలికపాటి తీవ్ర భయాందోళనలతో 5సం.లకు పైగా బాధపడుతున్నారు. గత 2 సం.లుగా, ఆమె కుడిపాదంలో పూర్వం జరిగిన శస్త్రచికిత్స మూలంగా నొప్పిమరియు రెండు మోచేతులలో నొప్పి వస్తోంది. ఆమె తాత్కాలిక ఉపశమనం కోసం గతంలో నొప్పిని తగ్గించే మాత్రలు వాడినది కానీ ప్రస్తుతం ఏ మందులు తీసుకోవటంలేదు. 25 నవంబర్ 2014 న ఆమె వైబ్రో చికిత్స ప్రారంభించారు:
అజీర్ణమునకు, తీవ్ర భయాందోళనలకు:
#1. CC3.7 Circulation + CC4.1 Digestion tonic + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...6TD
పార్శ్వనొప్పికి, కండరాల నొప్పి,రా ననొలప్పికి:
#2. CC11.4 Migraines + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive Tissue + CC20.7 Fractures ...6TD
ఒకవారంలో, ఆమె పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఆమె పాదంనొప్పి పూర్తిగా పోయి, ఆమె జీర్ణశక్తి (90%) బాగా మెరుగయింది, యాసిడ్ రిఫ్లక్స్ ఆగిపోయింది. గతంలో ఆమెకు అజీర్ణం కలిగించిన పప్పులు, తృణధాన్యాలు వంటి ఆహారాన్ని ఆమె తినగల్గుతోంది. ఆమె తీవ్ర భయాందోళనలు మాయమైనవి. మొత్తంమీద, ఆమె మానసికస్థితి (90%) బాగయింది; ఆమె ప్రశాంతతతో, సంతోషముగా వున్నది. ఆమె పార్శ్వతలనొప్పి (75%) బాగా తగ్గింది. ఆమె సమస్యలో వున్నా, తలనొప్పి అంత తీవ్రంగా లేకపోవుటయేకాక త్వరగా తగ్గుతున్నది. ఆమె చికిత్స కొనసాగించారు.
జనవరి 12, 2015న, గంటక్రితం, తన కుక్కను నడకకోసం తీసుకెళ్లినప్పుడు, ఆ ఉదయం సంభవించిన ప్రమాదంవల్ల వచ్చిన తీవ్రలక్షణాల చికిత్సకోసం ఆమె వచ్చింది. ఆమె కుక్క హఠాత్తుగా ప్రక్కకు తిరగగానే, ఆమె వెనక్కి లాగబోయి పడిపోయింది. ఆమెకు వీపునొప్పి తీవ్రంగా ఉండి, ఆకారణంగా నడుము వంచలేకపోతున్నది. ఆమెకు శ్వాస తీస్తున్నప్పుడు ఛాతీలో నొప్పి కూడా వస్తోంది. ఆమె ఏమందులను తీసుకోలేదు. అభ్యాసకుడు ఆమెను #1, #2 ని ఆపివేసి, వానికి బదులుగా క్రింది చికిత్స సూచించారు:
వీపు, నడుము నొప్పికి, శ్వాస తీస్తునప్పుడు వచ్చే ఛాతీ నోప్పి:
#3. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC20.2 SMJ Pain + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.7 Fractures...ప్రతి 10నిముషాలకి ఒక మోతాదు చొప్పున 2గంటలవరకు
ఒక గంటలో, ఆమెకు కండరాలముడి విప్పినట్లుగా, హాయిగా అనిపించినది. ఆమె ఛాతీలో నొప్పి సోలార్ ప్లెక్సస్ ప్రాంతానికి మారిపోయి, ఆమె నొప్పి లేకుండా ఊపిరి పీల్చుకున్నారు. 2 గంటల్లో, నొప్పి తీవ్రత తగ్గుస్థాయికి వచ్చింది. ఆమె తిరిగి వంగగలిగింది.
రోగి ప్రతి అర్ధగంటకు రెమిడీ కొనసాగించారు. మరునాటికి ఆమె వీపు ఎడమ భాగంలో కొద్దిపాటి అవశేష నొప్పితప్ప, మొత్తం నొప్పులన్నీ తగ్గినవి. 15 జనవరి న, 4 రోజుల చికిత్స తర్వాత, పూర్తిగా నొప్పి పోయి, మరి తిరిగిలేదు. #3 ఆపేసి, #1 మరియు #2 తిరిగి ప్రారంభించ బడ్డాయి.
అక్టోబర్ 2015 నాటికి, ఆమెకు 90% మెరుగైన పార్శ్వనొప్పి మినహా, మిగతా దీర్ఘకాలిక రోగలక్షణాలన్నీ తగ్గిపోయినవి. ఆమె #1 మరియు #2 TDS గా కొనసాగిస్తున్నారు.