Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ఊపిరి అందకపోవడం, అలసట, భయాందోళన 03507...UK


ఫిబ్రవరి 11, 2015న 53 సం.ల. వ్యక్తి శ్వాసలోపం (dyspnoea) చికిత్స కోసం వచ్చారు. అతను దర్జీ దుకాణం నడుపుతున్నారు. అతనికి ధూమపానం అలవాటు బాగా ఉంది కానీ 4 సం.రాల క్రితం ఆ అలవాటు పోయింది. గతంలో, అతను వుబ్బసంతో బాధపడినను, అల్లోపతీ మందులతో బాగా తగ్గింది. కానీ గత 2 నెలలుగా అతను స్వల్ప ఆయాసంతో శ్వాస తీసుకోవలసి  వస్తున్నది. యాంటిహిస్టామైన్స్ (Antihistamines), ఇన్హేలర్లు (Inhalers) పని చేయలేదు. కొన్ని అడుగులు నడవడం కూడా కష్టం. అతను చాలా అలసటతో, శక్తిలేక బాధపడుతూ, పనికి వెళ్ళడం కూడా మానేసేరు. అతను డాక్టర్ వద్దకు, తరువాత హృద్రోగనిపుణుని వద్దకు కూడా వెళ్ళేరు. అన్ని పరీక్షలు చేయగా, ఫలితాలన్నీ మామూలుగా వున్నవి. చివరగా, అతని డాక్టర్ ఊపిరితిత్తులలో అధికమైన కఫం తీసివేయుటకు మ్యూకొలైటిక్ ఏజెంట్ (Mucolytic agent) ను సూచించారు. కాని రోగి పరిస్థితిలో ఎట్టి మార్పులేదు.

రోగికి, శ్వాస అందకపోవుటకు అతని స్వంతవివరణ ఉంది. కొందరు అతనికి హాని చేయాలని, అతనికి శాపం పెట్టారని రోగి నమ్మారు. అతను తన తోటలో చిల్లంగి (Black Magic)యొక్క చిహ్నాలు కనుగొన్నాడు. అతని కుటుంబం, స్నేహితులుకూడా అతనితో ఏకీభవించేరు. రోగి చాలా భయపడిపోయారు, కానీ అభ్యాసకురాలు ఆయనకు హామీ ఇచ్చి, దేవుని మీద నమ్మకముంచమని కోరారు. ఆమె సూచించిన రెమిడీ:

#1. CC3.4 Heart emergencies + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disabilities + CC19.3 Chest infections chronic...నీటితో ప్రతీ పదినిమిషాలకు ఒకసారి రోజంతా సేవించాలి.

#2. CC3.7 Circulation + #1...6TD 

రోగికి  #1 మాత్రమే తీసుకోమని చెప్పేరు. 2 రోజుల చికిత్స తర్వాత, అతని శ్వాస సమస్య 30% తగ్గిందని చెప్పగా, #1 ను నిలపమని,  #2 ను తీసుకోమని చెప్పారు. 2 రోజులలో, అతనికి 50% మెరుగుదల కలిగి, పనికి తిరిగి వెళ్లేడు. అతనికి క్రమంగా మెరుగై, ఎక్కువ నడవ సాగేడు. ఒక వారం తరువాత, అతను తన దుకాణానికి నడుస్తుండగా, ఒక్కసారి మాత్రమే ఊపిరి ఆడనట్లు గమనించారు, గతంలో అతను శ్వాస అందక, మార్గంలో పలుసార్లు ఆగవలసి వచ్చేది. అతను డాక్టర్ చెప్పిన మ్యుకోలిటిక్ ఏజెంట్ ను ఆపేశాడు. మరొక వారంలో అతను మామూలుగా వున్నట్లు నివేదించారు. తన దుకాణానికి వెళ్తునప్పుడు, అతను చాలా చక్కగా శ్వాస తీసుకో గలుగుతున్నారు. అతనికి ఒకసారైనా ఆగాల్సిన, విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం కలుగలేదు. ఫిబ్రవరి 27, 2015 న అతను పూర్తిగా కోలుకున్నట్లు నివేదించారు.

అభ్యాసకురాలు రోగిని 6TD గా రెమిడీని మరొక వారం తీసుకోమని తరువాత 2 వారాలపాటు TDS గా తీసుకోమని, ఆపుటకు ముందు 2 వారాలు OD తీసుకోమని చెప్పిరి. అయినప్పటికీ, రోగి తనకు ఆరోగ్యంగా వుందని, రెండు వారాల తర్వాత వైబ్రోని  ఆపివేసారు.

మేలో అతను తిరిగి శ్వాస అందక, తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఛాతీ వైద్యుడు COPD(క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డీసీజ్)  అని నిర్ధారణ చేసారు. గత కొన్ని సం.లు.గా చేస్తున్న ధూమపానంతో రోగి ఊపిరితిత్తులు అలవాటుపడి ఉన్నాయి. ఇటీవల సంవత్సరాల్లోనే అతను దానిని మానివేయ గలిగారు. అక్టోబర్ 2015 నాటికి, రోగి బాగానే కోలుకొని సాధారణ జీవితాన్ని సాగిస్తున్నారు. .

సంపాదకుని గమనిక:
ఈ నివేదిక ఇతర ఔషధాలు పనిచేయని శ్వాస అందని స్థితిలో వైబ్రియోనిక్స్ సహాయపడింది. COPD యొక్క రోగికి, సుదీర్ఘ కాలం వైబ్రో చికిత్స కొనసాగించాల్సిన అవసరం ఉంది.