(Barber’s) క్షౌరశాల సంబంధిత దురద 01767...Holland
ఆగష్టు 30 తేదీన, 40 ఏళ్ల వ్యక్తి , ఆగష్టు 19న కనిపించిన క్షురకర్మ సంబంధిత దురదకు (ఉపరితల శిలీంధ్రసంక్రమణ) చికిత్సకై వచ్చిరి. ఆయన ముఖం, కనుబొమ్మలు, తలపై పెద్దమచ్చలు వుండినవి. ఇంజినీర్ గా తన ఉద్యోగ బాధ్యతల ఒత్తిడియే ఆమచ్చలకు కారణమని అతను భావించారు. వికారమైన మచ్చలవల్ల అతను ఉద్యోగానికి కూడా వెళ్లలేకున్నారు. అతని డాక్టర్ దాన్ని క్షౌరశాల దురదగా గుర్తించి, యాంటిబయోటిక్ Fucidin వ్రాసినను, ఫలితంలేక ఆగష్టు29న రోగి దాన్ని ఆపేసారు. మరుసటి రోజు క్రింది కాంబో అతనికి ఇవ్వబడింది:
#1. CC11.1 Hair tonic + CC11.2 Hair problems + CC15.1 Mental and Emotional tonic…6TD
వారం తరువాత (సెప్టెంబరు 5) రోగి తనకు 100% మెరుగయినట్లు చెప్పారు. అతను గోకడం మానేసి, సూచించినప్రకారం పరిహారం తీసుకున్నారు. మచ్చలన్నీ మాయమై, అతని చర్మం యధాస్థితికి వచ్చింది. రోగికి వైబ్రో వైద్యంతో త్వరగా మెరుగైంది. మరో 3రోజులు అదేమోతాదులో మందువాడి, 3రోజులు BD, 7రోజులు OD, ఆపుటకు ముందు 7రోజులు 3TW ని రోగి కొనసాగించారు.
అయితే రోగి పిల్లలకు కూడా అట్లే వచ్చినవి. సెప్టెంబర్ 5న రోగియొక్క 5సం.ల. బాలునికి ముఖం, నోటిచుట్టూ మచ్చలు కనిపించి, చికిత్సకై వచ్చారు. అతనికి కూడా అదే కాంబో పరిహారం TDS యిచ్చారు. మరే వైద్యం చేయించలేదు. సెప్టెంబర్ 8 వరకు బాలుడు దురదతో గోకుట మానలేదు. తర్వాత దురద తగ్గడం మొదలై, సెప్టెంబర్ 12 తేదీ నాటికి బాలునికి 100% తగ్గిపోయింది. అప్పుడు మోతాదు తగ్గించి BD చొప్పున వారంరోజులు వాడి మానేయమనిచెప్పారు.
10 సెప్టెంబర్ న 10సం.ల. రోగి కుమార్తెకు ముఖంపై అట్టివే మచ్చలు వచ్చినవి. ఆమెకు కూడా అదే పరిహారమును…QDS గా యిచ్చారు. వారం తర్వాత మచ్చలు మాయమవడం మొదలై, మరో 2రోజులలో ఆమె చర్మం యధాస్థితికి వచ్చినది. ఆమె అదే రెమిడీ 7రోజులు QDS, మరొక 7రోజులు BD, వాడి క్రమంగా మానివేసినది. ఏడాది అయేసరికి ముగ్గురు రోగులు క్షౌరశాల దురద లేక హాయిగా వున్నారు.