తీవ్రమైన నిరాశ, ద్వంద్వదృష్టి, నిద్రలేమితనం 01339...USA
స్నేహితుని సలహామీద ఒకయువకుడు తన 65ఏళ్ల తల్లికి చికిత్స కోరుతూ, మార్చి 2014లో అభ్యాసకునరాలికి ఇమెయిల్ పంపారు. అతనితల్లి గత 3సం.లు.గా నిరాశ, నిస్పృహ, మానసిక భయాందోళనలతో బాధపడుతున్నారు. ఈసమయంలో ఆమెకు శారీరక రోగాలు కూడా అంచెలుగా వచ్చినవి. ఆమె బాగా బరువు తగ్గింది. శస్త్రచికిత్సతో గర్భాశయాన్ని తొలగించిరి. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, పిత్తాశయంలో రాళ్ళు, నోటిపూతలు, గుండెల్లోమంట, నిద్రలేమి, తీవ్రపార్శ్వనొప్పి, ముక్కుకు సంబంధించిన సమస్యలు, మలద్వారంచుట్టూ కురుపులు, మరియు ప్రస్తుతం ద్వంద్వ దృష్టి వంటి ఎన్నో రోగాలు ఆమెను ముట్టడించినవి. ఈ రోగాలన్నిటితో ఆమెకు మరింత నిస్పృహ ఎక్కువైంది. ఆమె రోజులో చాలాభాగం మంచమ్మీద నిద్రలోనే గడుపుతోంది. తన వివాహ సమయం లోనే తనతల్లి ఆరోగ్యసమస్యలు మొదలైనట్లు కొడుకు చెప్పారు. తల్లి నిస్పృహకు మానసిక చికిత్స, దానికి సంబంధించిన మందులతో చికిత్స చేయబడింది, కుటుంబం కూడా మధ్యవర్తిత్వం, సంగీత చికిత్సను ప్రయత్నించారు. కానీ ఏమీ ఫలితం ఇవ్వలేదు.
కొడుకు ఇ-మెయిల్ అందుకుని, అభ్యాసకురాలు తల్లి, కొడుకులతో మార్చ్ 23, 2014 న టెలిఫోన్ లో మాట్లాడినారు. ఆమె ఈ క్రింది పరిహారం మెయిల్ చేసినారు:
నిస్పృహ, మిగిలిన మానసిక ఆందోళనలకు:
#1. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disorders + CC18.2 Alzheimer’s disease…TDS ఒక వారానికి తరువాత QDS
రోగికి చికిత్సనారంభించిన 12వ రోజుకి కూడా మెరుగవకపోవుటచే, #1 ని మార్చి, ద్వంద్వదృష్టి లోపమునకు రెమిడీ
#2. CC7.1 Eye tonic + CC7.5 Glaucoma + CC7.6 Eye injury + #1…QDS:
అంతేకాక మరొకటి .
నిద్రలేమి కొరకు:
#3. CC15.6 Sleep disorder…నిద్రకు 30 ని.ల. ముందు ఒక మోతాదు. ఇంకా నిద్ర రాకపోతే ప్రతి 30 ని.ల.కి ఒక మోతాదు చొప్పున 4 సార్లు యివ్వవచ్చును. మధ్యరాత్రిలో రోగి లేస్తే మళ్ళీ అదే మోతాదు కొనసాగించాలి.
అభ్యాసకురాలు 6 నెలలు వరకు రోగి కుటుంబంనుండి ఏసంగతి వినలేదు. 5 నవంబర్ 2014న కుమారుడు ఇ-మెయిల్లో 'తనతల్లికి అకస్మాత్తుగా, పరిపూర్ణంగా నిస్పృహనుండి మెరుగయిందని, అంతకుముందే ద్వంద్వదృష్టి లోపం పూర్తిగా తగ్గిందని' వ్రాసి పంపేడు. అభ్యాసకురాలు కుటుంబాన్ని సంప్రదించిరి. రోగి చాలా సంతోషంతో, తన ఆరోగ్యమును యధాస్థితికి తెచ్చినందుకు సాయి పట్ల కృతజ్ణతతో వున్నది. ఆమె యిప్పుడు సంతోషంగా కుటుంబానికి వండి పెడుతూ, మనవళ్లతో, కొడుకు, కోడలుతో తనజీవితం ఆనందింగా గడుపుతోంది. అక్టోబర్ 2015 నాటికి, అభ్యాసకురాలు రోగికి, ఆమెకుగల ఇతర రోగాలకు చికిత్సనందిస్తున్నది.
రోగి యొక్క కొడుకు ఇమెయిల్స్:
23 మార్చి 2014:
మే 2011 లో నా తల్లి తీవ్ర నిరాశకు గురయి, దానినుండి కొద్దిసేపుకూడా బయటకు రాలేదు. సమయం గడిచేకొద్దీ ఇది మరింత లోతైన, గజిబిజి సమస్యగా కనిపించింది. ఇది మే 2011 లో నా వివాహం సమయంలో ప్రారంభమైంది. నిస్పృహకు నిజమైన కారణం తెలియదు. కానీ చాలా కారణాలు వుండొచ్చు. కోడలుగా వచ్చిన మరొక స్త్రీవల్ల, తన కుమారుడు తనకు దూరమవుతాడేమోననే భయం, వివాహానికి ఏర్పాట్లు, ఒత్తిడి, ముంబైలో అతి వేడి వేసవి మరియు కాలుష్యం, అత్తమామలతో కొన్ని విబేధాలు వంటి ఎన్నో భయాలు ఆమెకు కలిగి వుంటాయి. అవన్నిటితో ఆమె లోపల కుములుతుంటే, నా మామగారు వివాహానికి కొన్ని రోజులముందు చాలా అవమానకరంగా ఏదో అన్నాడు. అది ఆమె మనసుమీద దెబ్బ తీసింది.
మే 2011 ఆమెలో మార్పు మొదలైంది. ఆమె చాలా ప్రతికూలంగా వుంటూ, కోపంతో ప్రవర్తించేది. ఆమె గతంలో స్థిరపడిపోయిన మనసు తో, ఎల్లప్పుడూ గతంగురించే మాట్లాడుతూ, తనెన్ని పాపాలు చేసిందో చెప్పేది. ఆమె తనలోతాను చెప్పిందే చెప్పుకొంటుండేది. ఆమె రోజంతా ఏడుస్తూ, మరణంగురించి భయపడుతుంది. తాను త్వరలో మరణిస్తే, తన పాపాలవల్ల, ఎట్టిజన్మ వస్తుందోనని ఆమెకు ఒకటే భయం. ఆమె నాకు ఆఫీసుకి చాలాసార్లు ఫోన్ చేస్తూ, నా పనిని ఆటంకపరుస్తోంది. మానాన్న ప్రవర్తన కూడా ఆమెను బాధపెడుతోంది. ఆమెకు మానసికవేదనతోపాటు గత 3 సం.ల.లో అనేక వ్యాధులు కూడా కలిగినవి. ఆమె చాలా బరువు కోల్పోయింది. ఆమెకు గర్భాశయ శస్త్రచికిత్స, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, పిత్తాశయంలో రాళ్ళు, నోటిపూతలు, గుండెల్లో మంట, నిద్రలేమి రాత్రులు, తీవ్రపార్శ్వనొప్పి, ముక్కుకు సంబంధించిన సమస్యలు, మలద్వారంచుట్టూ కురుపులు, ప్రస్తుతం ద్వంద్వదృష్టి వంటి ఎన్నోరోగాలు ఉన్నాయి. వీనివల్ల ఆమెకు ఎక్కువ నిస్పృహ కలుగుతోంది. ఆమె తనమంచంమీద ముడుచుకొని, రోజంతా నిద్రపోవటం ఇష్టపడుతుంది.
మేము మానసిక చికిత్సకు మందులు, వివిధ ప్రత్యామ్నాయాలను (మానసిక చికిత్స, ధ్యానం, మృదుమధుర సంగీతాన్ని వినిపించడం వంటివి) ప్రయత్నించాము కానీ ఏమీ పనిచేయలేదు. తన ప్రస్తుతమానసికస్థితిలో, ధ్యానంచేయడం, సానుకూలదృష్టితో ఆలోచించడం అసాధ్యం. మేము ఆమెను బిజీగా ఉంచి, ఆమెను ఎందులోనైనా నిమగ్నం చేయాలని ప్రయత్నించాము, కానీ మేము అంతమాత్రమే చేయగలం.
ప్రజలు ప్రార్ధనలు అద్భుతాలు చేయగలవని, దేవుడు చమత్కారాలు చేస్తాడని ప్రజలు చెప్తారు. దేవుడు మా ప్రార్థనలను వినడంలేదు. మేము ఇంకా అద్భుతంకోసం ఎదురుచూస్తున్నాము. ప్రతివ్యక్తి జీవితంలో వొడుదుడుకులు తప్పవని, మన చెడ్డకర్మలకు మనమే ఫలం అనుభవించాలని నాకు తెలుసు. కానీ నిజానికి, గత 3 సం.లలో మా అమ్మ, మేము అనేక జీవితకాలాల నుండి చేసిన పాపాలను నిర్మూలించడానికి తగినంత బాధపడుచున్నాము. మాలో నెమ్మదిగా ఓర్పు నశిస్తూ, రోజుకు రోజు చికాకు ఎక్కువైపోతున్నది. మాది వుమ్మడి కుటుంబం కావటంవల్ల, మా అందరికీ, ముఖ్యంగా నాభార్యకు చాలా ఇబ్బంది కలుగుతున్నది.
5 నవంబర్ 2014:
నా తల్లికి గత 3½ సం.లై బాధపడుతున్న తన తీవ్ర నిస్పృహ పూర్తిగా తగ్గినదని, మీకు ఆనందంతో తెలియజేస్తున్నాను! అకస్మాత్తుగా అద్భుతం జరిగి, ఆమె తిరిగి సాధారణస్థితికి వచ్చిందని గ్రహించడానికి మాకు కొన్నిరోజులు పట్టింది! ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు, కాని దీనికంతటికి స్వామి మహత్యం, మీరిచ్చిన వైబ్రో పరిహారాలు కారణమని చెప్పగలను. ఆమె సరిగ్గా చెప్పిన మోతాదులో వైబ్రో పరిహారాలు వాడినది. అవి అద్భుతంగా పనిచేసినవి. ఏ మనోరోగ వైద్యం 3 సం.లలో చేయలేని అద్భుతాన్ని, వైబ్రో 6 నెలల కన్నా తక్కువలో చేసింది. ఆమె నిస్పృహనుండి బయటపడుటకు పూర్వమే ఆమె ద్వంద్వదృష్టి అదృశ్యమయ్యింది. సరిగ్గా యెప్పుడన్నది గుర్తులేదు. నా కుటుంబం మరియు నేను మీకు చాలా కృతజ్ణులము. గత 3½ సంవత్సరాలు చాలా కష్టకాలం.