గుండెకు శస్త్రచికిత్స జరిగిన తర్వాత గుండెలో చిన్న పోట్లు 02890...USA
వైబ్రియోనిక్స్ వైద్యుని 74 ఏళ్ల సోదరికి 2013 లో గుండెపోటు వచ్చి, గుండె-బైపాస్ శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స తర్వాత, ఏర్పడ్డ చిన్న రక్తం గడ్డల కారణంగా ట్రాన్సిఎంట్ ఇషిమిక్ ఆటాక్స్(TIA) లేదా చిన్నస్ట్రోక్స్ అనుభవించారు. దురదృష్టవశాత్తూ దీనివలన మింగడం/పొరబారడమునకు సంబంధించిన ప్రేరణను నియంత్రించే మెదడులో భాగం పాడయినది. కనుక విశ్రాంతి సమయంలో కూడా ఆమె తినడం లేదా మాట్లాడటం గొంతు పొరబారకుండా చేయలేకపోతున్నారు. ఆమె అధిక కొలెస్ట్రాల్ కోసం, రక్తం పల్చబడుటకు, మందులు వాడి, ఒకనెల చికిత్స తర్వాత యింటికి వచ్చారు. అభ్యాసకుడు ఆమెకు తోడుగా నిలబడి, కింది రెమిడిని ఇచ్చారు:
శరీరంలో నొప్పులకు, కీళ్లనొప్పులకు:
#1. CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue…BD
గుండెనొప్పికి, గుండెపోటుకు:
#2. CC3.4 Heart emergencies + CC3.5 Arteriosclerosis + CC18.4 Paralysis…BD
కాలేయమునకు (లివర్), చర్మ వ్యాధికి:
#3. CC4.2 Liver & Gallbladder tonic + CC4.10 Indigestion + CC21.1 Skin tonic + CC21.5 Dry Sores…BD
# 2 యొక్క మొదటి మోతాదు తనసోదరి నాలుకక్రింద పెట్టినప్పుడు, వైబ్రియోనిక్స్ వైద్యునికి బాగా మెరుగుదల కనిపించింది. ఆమె చురుకైన కళ్ళతో, యధాప్రకారమైన శక్తితో, బహుళకార్యనిపుణతతో కనిపించారు. దానివల్ల వైబ్రో ఔషధంలో రోగికి విశ్వాసం బలంగా ఏర్పడింది. ఆమె మోతాదు ప్రకారం, సూచించిన విధంగా వైబ్రో మందులు కొనసాగించారు. ఆమె గొంతు పలమారటం క్రమంగా తగ్గి, ఏడాది గడిచేసరికి, అది 100% పోయింది. అక్టోబర్ 2015 వరకు, క్రమపద్దతిలో కాకున్నా, రోగి వైబ్రో తో కొనసాగి ఆలస్యంగానైనా ఆమె తన పూర్వశక్తిని అద్భుతంగా పొందగలిగారు.
ప్రాక్టీషనర్ వ్యాఖ్య: దైవ కృప ఈ స్వస్థతలో స్పష్టమైనది. అంతేకాక రోగి, అభ్యాసకుడు యిద్దరికీ ఇది ఒక మంచి అనుభవమై మిగిలింది.