తైలగ్రంధి మూసుకుని కనురెప్పలో కురుపు (చలాజియాన్) 02817...India
22 ఆగస్టు 2015 న 23సం.ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన కుడి దిగువ కనురెప్పలో వచ్చిన కంటి కురుపు చికిత్సకొరకు వచ్చినది. ఆకురుపు 3రోజుల క్రితం మొదలైనది. ఆమె కంటిడాక్టర్ వద్దకు వెళ్లి, అతడు సూచించిన యాంటీబయోటిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ కంటి చుక్కలు (Occumox K), లేపనం (Ocupol-D) వాడినది. కానీ గత 2రోజుల్లో కురుపు పెద్దదై, చీము పట్టింది. అది చూసి, డాక్టర్ శస్త్రచికిత్స తప్ప మరోమార్గం లేదన్నాడు. 3-4 సం.ల క్రితం రోగికి ఇదే సమస్యకి శస్త్రచికిత్స జరిగింది. రోగి మరునాడే శస్త్రచికిత్స చేయించు కోవాలనుకున్నా, డాక్టర్ అందుబాటులో లేక శస్త్రచికిత్స జరగలేదు. 3 సం.ల క్రితం ఈ రోగికి మొటిమలు, జలుబు, జ్వరంతో బాధపడ్డప్పుడు వైబ్రో మందులవల్లనే పూర్తిగా నయమైంది. తన గత అనుభవంవల్ల రోగికి వైబ్రోనిక్స్ మీద నమ్మకం యేర్పడింది. ఆమె కంటి చుక్కలు, లేపనం వాదటం మానేసి, వైబ్రో వైద్యుడిని సంప్రదించగా, ఆమెకు ఈ పరిహారం ఇవ్వబడింది:
#1. CC2.3 Tumours & Growth + CC3.7 Circulation + CC7.3 Eye infections + CC10.1 Emergencies + CC12.4 Autoimmune diseases + CC17.2 Cleansing + CC20.4 Muscles & Supportive tissue + CC21.11 Wounds & Abrasions + potentised Wysolone*… నీటితో, 5మిల్లీ లీటర్ చొప్పున నోటిద్వారా గంటకొకసారి; ఒక చుక్క చొప్పున రోస్ వాటర్ కంటిలో గంటకి ఒక్కసారి వేయాలి.
* స్టెరాయిడ్ Wysolone SRHVP ఉపయోగించి 200C వద్ద potentise చేసారు. ఒక చుక్క వైద్యం ప్రక్రియ వేగవంతం చేయుటకు కాంబోలో జతచేయబడింది.
అదే సమయంలో, కాంబో నిరంతరం SRHVP ను ఉపయోగించి ప్రసారం చేయబడింది. 3వరోజు చికిత్స తర్వాత, చాలా చీము కురుపు నుండి బయటకు వచ్చేసింది. నోటిద్వారా తీసుకుంటున్న మందు, కంటి చుక్కలు కూడా 6TD కు తగ్గించబడ్డాయి. 4 రోజుల తరువాత, పరిస్థితి 70% మెరుగయింది. బ్రాడ్ కాస్టింగ్ నిలిపివేయబడి, చికిత్స సర్దుబాటు చేయబడింది:
#2. Remedy #1 minus the potentised Wysolone…6TD orally and in eye drops
8వ రోజు చికిత్సతో పరిస్థితి 100% నయమైంది. # 2 ఒకవారం కొనసాగించి, క్రమంగా తగ్గించబడినది.
ప్రాక్టీషనర్ వ్యాఖ్య: శారీరకంగా మరియు బ్రాడ్కాస్టింగ్ వైద్య రూపాల్లోనూ రోగికి అదే పరిహారాన్ని ఇవ్వడంవల్ల వైద్యం త్వరగా ఫలితాన్ని యిచ్చింది.
రోగి యొక్క వ్యాఖ్యలు (క్రింద ఉన్న ఫోటోలను చూడండి):
ఆగష్టు 19, 2015 న నాసమస్య మొదలైంది. వాపుతోపాటు నా కుడి దిగువ కనురెప్పలో పసుపురంగు చీముతో పెద్దకురుపు లేచినది. నేత్ర వైద్యుడు సూచించిన యాంటీబాక్టీరియా కంటిచుక్కలు, లేపనం వాడిన 3రోజుల తర్వాత కూడా మొదటి ఫోటోలో చూపించిన విధంగా ఏమి తగ్గలేదు. కంటికురుపు తొలగించడానికి, నేత్ర వైద్యుడు శస్త్రచికిత్స చేయ నిర్ణయించిరి. నా గత అనుభవంతో, వైబ్రో వైద్యంపై విశ్వాసాన్ని కలిగి ఉన్నందున, నేను వైబ్రో చికిత్స చేయించు కునేందుకు నిర్ణయించుకున్నాను.
నేను వైబ్రోచికిత్స ప్రారంభించిన 1వ రోజు తర్వాత 2వ ఫోటో తీయబడింది. దీనికి ముందు, చీము, వాపు చాలా ఎక్కువగా వుండెను. ఒక రోజు తరువాత కొంతబాధ వున్ననూ, కన్ను కొంత మెరుగయినది. 3వనాడు, చీము నొక్కకుండా, నొప్పి లేకుండా బయటకు వచ్చేసింది. నా కంటిరెప్పలో కురుపు వైబ్రోచికిత్సవల్ల కేవలం 3 రోజుల్లోనే పోయింది. కొద్దిగా వాపు మాత్రమే మిగిలి, 3వ నాటి రాత్రికి వాపు కూడా తగ్గింది. 4వ రోజున, కొద్దిగా ఎరుపు మాత్రమే వుండెను. వాపు 80% తగ్గింది. నొప్పి అసలు లేదు. 5వ రోజున, ఎరుపు మరింత తగ్గి, వాపు దాదాపు 100% తగ్గింది. 6వ రోజున, కంటి ఎరుపు, వాపు యొక్క నామమాత్రంగా కూడా లేకుండా నాకన్ను పూర్తిగా బాగయింది.
నేను chalazion మరియు stye సమస్యలతో నేను 3-4 సం.ల క్రితం బాధపడ్డాను. నాకన్నులో కురుపులను, శస్త్రచికిత్సతో తొలగించిరి. శస్త్రచికిత్స తరువాత, నేను చాలారోజులు యాంటీబయాటిక్స్ తీసుకొంటిని. కంటిపై వెచ్చనినీటి వత్తిడితో కాపు చేసితిని. ఆప్రక్రియ చాలా బాధాకరం. విబ్రియోనిక్స్ వలన ఏనొప్పిలేకుండా, వారంలోగా నాబాధ పూర్తిగా పోయింది. నాకు అవసరమైనదల్లా ఇద్దరు తెలివైన వైబ్రో వైద్యులతో పాటు నాలోని విశ్వాసం. సాయి వైబ్రియోనిక్స్ కు నా హృదయపూర్వకకృతజ్ఞతలు!
సెప్టెంబరు 8న, నేను తనిఖీ కోసం నేత్ర వైద్యుడివద్దకు వెళ్ళినప్పుడు, నా కన్ను పూర్తిగా నయమైనందుకు, ఆయన చాలా ఆనందించారు. నా కన్ను లేసిక్ (లేజర్ కంటి శస్త్రచికిత్స) చేసేందుకు తగినంత కోలుకోవడం చూసి డాక్టర్ చాలా ఆశ్చర్యపోయేరు. ఇది సెప్టెంబర్ 12 న విజయవంతంగా జరిగింది. శస్త్రచికిత్స తరువాత వైద్యం కూడా చాలా వేగంగా జరిగింది. వైబ్రోనిక్స్ కు కృతజ్ఞతలు.
2 వ రోజు (22 ఆగస్ట్) 3 వ రోజు (23 ఆగస్ట్)
5 వ రోజు (25 ఆగస్ట్) 7 వ రోజు (27 ఆగస్ట్)