విరిగిన కటివలయం ఎముక, అతిసారంవ్యాధితో బలహీనమైన పిల్లి 02658...Italy
నవంబరు4, 2013న రోమ్ వీధుల్లో, స్వచ్ఛందసేవకులు తీవ్రంగా గాయపడి, చాలానీరసంగా పడున్నపిల్లిని చూసారు. మళ్ళీ మరో 10రోజుల తర్వాత ఒక మూలలో పడున్న అదే పిల్లిని చూసే వరకూ అది వీరికి కనబడలేదు. ఆ సమయంలో పిల్లి నొప్పితో నడవలేకుండా వున్నది. పిల్లిని పశు వైద్యుని వద్దకు తీసుకు వెళ్లారు. X-ray తీయించగా, గత 2వారాలుగా పిల్లి తుంటి విరిగినట్లు తెల్సింది. పిల్లికి అతిసారం కూడా ఉంది, అందువల్ల పిల్లికి పురుగుల కోసం చికిత్స చేసారు. ఈ అభ్యాసకుని రోగులలో ఒకరు పిల్లిని తమఇంటికి తీసుకెళ్ళారు. పిల్లిని ప్రేమతో చూసుకుంటూ వైబ్రియో చికిత్సను కోరగా, నవంబర్ 25న పిల్లికి వైబ్రోరెమిడీ ఇవ్వబడింది: CC4.6 Diarrhoea + CC12.2 Child tonic + CC20.7 Fractures…TDS
వారంలో అతిసారం పూర్తిగాతగ్గి, పిల్లి బరువు పెరిగినది. డిసెంబరు5న మళ్ళీ తీసిన X- rayలో విరిగిన ఎముక బాగానే అతుకు కుంటున్నట్లు కనిపించింది. కిట్టీ(పిల్లి) మామూలుగా నడవగలుగుతూ దాని నివాసం నుండి బయటకు రావడం ప్రారంభించింది. 2014 జనవరి 5న తీసిన పశు వైద్య నిపుణుడు తీయించిన చివరి X-rayలో కటి వలయం పూర్తిగా నయమైనట్లు కనిపించింది. పిల్లి పూర్తి ఆరోగ్యంతో బయటకు వచ్చి, రెండు పిల్లులని సవాలు చేయగల స్థితికి వచ్చినది. దాని ఆరోగ్యం ఎంతో మెరుగయ్యింది.