హెచ్ ఐ వి / ఎయిడ్స్ 11177...India
AIDS తో బాధ పడుతున్న పేద కుటుంబానికి చెందిన 24 ఏళ్ల మహిళ 12 డిసెంబర్ 2012 న వైబ్రో చికిత్సకు వచ్చారు. ఆమెకు భర్తనుండి ఈ రోగం సంక్రమించినది. 6సం.ల క్రితం జరిగిన వారి వివాహానికి ముందే ఆమె భర్తకు ఎయిడ్స్ ఉన్నా, అతను చెప్పలేదు. ఏడాది క్రితం ఆమెకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు, అనారోగ్య సమస్యల వల్ల ఆమె ఆసుపత్రిలో చేరింది. అప్పుడు జరిగిన రక్త పరీక్షల్లో ఆమెకు ఎయిడ్స్ వున్న సంగతి హఠాత్తుగా తెలిసింది. దురదృష్టవశాత్తూ బిడ్డ బ్రతకలేదు. తనకుటుంబం సహాయంతో ఆమె విడాకులకు దరఖాస్తు చేసింది, అప్పుడు స్థానిక ప్రజా ఆసుపత్రిలో ఆమెకు HIV / AIDS కొరకు చికిత్స ప్రారంభించారు. అలోపతి మందులు తీసుకున్నది. తన పొరుగువారి ద్వారా ఆమెకు వైబ్రో చికిత్స గురించి తెలిసింది. లోపలికి రాగానే, రోగి తను బాగా అలిసిపోతూ ఉన్నట్లు చెప్పినది. ఆమెలో ఉదాసీనత, నిరాశ, జీవితంపట్ల అనాసక్తి వంటి లక్షణాలు కనిపిస్తున్నవి. వైబ్రో ప్రాక్టీషనర్ ఇచ్చిన రెమిడీ:
CC12.1 Adult tonic + CC12.3 AIDS-HIV + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic…TDS
వైబ్రో చికిత్స మొదలు పెట్టిన తరువాత రోగికి రోజు రోజుకూ మెరుగవసాగినది. ఆమె అల్లోపతి మందులు కూడా తీసుకొనసాగింది. ఆమె 11నెలలపాటు క్రమం తప్పక వైబ్రో నివారణను తీసుకున్నారు. ఆవేళలో ఆమె దృక్పధంమారి వుత్సాహంగా, ఆశావాదంతో జీవితంపట్ల ఆసక్తి చూపసాగారు. ఆమెకు ఉద్యోగం దొరికి పనిలో చేరారు. ఆమె పునర్వివాహం చేసుకోవటానికి వైబ్రో వైద్యుని సలహా అడిగి ఆప్రకారం, రోగి తిరిగి రక్తపరీక్ష చేయించుకున్నది. ఆసుపత్రి నివేదిక ప్రకారం ఆమె రక్త గణన ఆమోదమైన పరిధిలో ఉంది. డాక్టర్లు ఆమె భర్తకి హాని కలిగించే ప్రమాదం లేదని, నిర్భయంగా పెళ్లిచేసుకోవచ్చని చెప్పారు. రోగి చాలా సంతోషించి, వెంటనే శుభవార్త ఆనందంగా వైబ్రో వైద్యునికి ఫోన్ చేసి చెప్పారు.
ప్రాక్టీషనర్ వ్యాఖ్య: ఇదంతా శ్రీ బాబా అత్యద్భుత లీల.