కేన్సర్ రోగంతో బాధపడుతున్న కుక్క 02864...USA
ఒక మహిళ,కేన్సర్ తో (ఛాతీ కుహరంలో) బాధపడుతున్న తన 6 ఏళ్ల కుక్క, హెన్రీను వైబ్రియోనిక్స్ వైద్యుని వద్దకు తీసుకు వచ్చారు. పశువైద్యుడు కేన్సర్ బాగా ముదిరినదని, హెన్రీ కొద్దికాలమే జీవిస్తుందని చెప్పారు. కుక్కకు శ్వాస పీల్చటం కష్టమవుతున్నది. అభ్యాసకుడుకేన్సర్ పెరుగుదలను తెలుసుకొని ఈ క్రింది రెమిడీ ఇచ్చారు;
CC1.1 Animal tonic + CC2.1 Cancer + CC2.2 Cancer pain + CC2.3 Tumours & Growths + CC19.1 Chest tonic + CC19.3 Chest infections…BD నీటిలో కలిపి ఇవ్వాలి.
మొదటివారం తర్వాత మహిళ వచ్చి హెన్రీ ఆరోగ్యంగా కనిపిస్తున్నట్లు, బాధ కూడా తగ్గినట్లు చెప్పారు. అదే సమయంలో మహిళ తన మరోకుక్క మెడలో గత 12 సం.లు.గా గడ్డ పెరిగిందని, దరిమిలా పశువైద్యుడు దానికి మత్తుమందిచ్చి, మెడలో గడ్డ శస్త్రచికిత్సతో తొలగించారని చెప్పారు. ఈ కుక్క, హెన్రీ కూడా ఒకే గిన్నెలో త్రాగుతున్నాయని, హెన్రీ పరిహారం 3వారాలు తీసుకున్న తర్వాత ఈ రెండవ కుక్క ఆరోగ్యం కూడా చాలా మెరుగయిందని చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత వైబ్రియోనిక్స్ నీరువల్లనే తన 2వ కుక్క కూడా అంత త్వరగా కోలుకుందని కూడా తెలిపారు.
హెన్రీ కేన్సర్ తగ్గుముఖం పట్టి, ఆరోగ్యం స్థిరంగా వుంది. కానీ క్యాన్సర్ ముదిరిపోయేదాకా వైబ్రియోనిక్స్ చికిత్స అందకపోవటంవల్ల, హెన్రీకి పూర్తి ఆరోగ్యం లభించటం కష్టమని ఆలశ్యం అవడం తప్ప ప్రయోజనం లేదని యజమాని ఆలోచించినారు. బాధపడుతున్న హెన్రీని 6వారాల తర్వాత శాశ్వతనిద్రలోకి పంపించాలని కుటుంబం నిర్ణయించింది.