దీర్ఘకాలిక మానసికవ్యాధి 10831...India
ఒక 96 ఏళ్ల మహిళ వైబ్రోనిక్స్ ప్రారంభించుటకు, ఏడాది ముందునుంచీ, వృద్ధాప్య కారణంగా వచ్చిన మానసిక చాంచల్యంతో వున్నట్లు రోగ నిర్ధారణ జరిగింది. ఆమె వయస్సు కారణంగా వైద్యులు చికిత్సకు మొగ్గు చూపలేదు. ఆమె బాత్ రూమ్ కు వెళ్లటంవంటి, తనపనులను కూడా చేసుకోలేకపోతున్నారు. ఆమె రోజులో 24గం.లు. తనకొడుకుపై అన్నిపనులకు పూర్తిగా ఆధారపడ్డారు. అతను వైబ్రియోనిక్స్ గురించి విని, అభ్యాసకుడితో సంప్రదించగా అతడు వచ్చి, బాహ్యప్రపంచంతో సంబంధంలేక, పడకపై పడున్న వృద్ధురాలిని చూచి, క్రింది వైబ్రో రెమిడీ ఇచ్చారు:
CC12.1 Adult tonic + CC18.2 Alzheimer’s disease...TDS
పైకాంబో తీసుకున్న వారంలో, రోగిలో మెరుగుదల ప్రారంభించింది. ఆమె ఆత్మవిశ్వాసంతో, మొండి పట్టుదలతో, బెడ్ పేన్ వుపయోగించక, బాత్ రూమ్ కు తీసుకెళ్ళమని అడుగుతున్నారు. మరొక వారం చికిత్స తరువాత, ఆమె తనంతట తానుగా వాకర్ సహాయంతో, బాత్ రూమ్ కి వెళ్లటంవంటి, తన సొంత అవసరాలకు తనే వెళ్లనారంభించారు. ఆమె నిత్యం వైబ్రో మందులు కొనసాగించారు. దీనితో, ఆమె పరిస్థితి మరో రెండేళ్ళు నిలకడగా ఉంది. అప్పుడు 98ఏళ్ల పండువయసులో ఆమె తన పరలోకయాత్రకు శరీరము విడిచినది.