భుజంలో ఎముకవిరుగుట 03507...UK
ఏప్రిల్ 9, 2015 న 75ఏళ్ల వ్యక్తి, విరిగిన ఎడమభుజము చికిత్సకై వచ్చినారు. 2వారాలవెనుక, అతను గోల్ఫ్ ఆడుతుండగా, పడిపోవడం వలన రెండు చోట్ల చేయి విరిగింది. అతని చేతికి ప్లాస్టర్ కట్టు వేసి, తీవ్రమైననొప్పి తగ్గుటకు మాత్రలు యిచ్చారు కాని వానివల్ల అతనికి ఏమీ ఉపశమనం కలగకపోగా, అతని కడుపులో కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అతను నొప్పితో రోజంతా మొద్దుబారినట్లుగా కూర్చుంటారు. రాత్రి నొప్పి వల్ల నిద్ర కూడా దూరమైంది. అతను తెల్లవారుఝామున, కేవలం అలసటవల్ల కాస్త కునుకు తీస్తున్నారు. అతను క్రింది పరిహార మిశ్రమాలతో చికిత్స చేయబడ్డారు:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis + CC20.7 Fractures...6TD
రోగి వైబ్రో పరిహారాన్ని ప్రారంభించగానే నొప్పిమాత్రలను నిలిపివేశారు. మరునాడు అతను నొప్పి కొంత తగ్గినట్లు గమనింఛారు. అతను రాత్రిపూట కొంతనిద్ర పోగలగడమే కాక వారం తరువాత అతను 30% మెరుగైనట్లు తెలిపారు. అతని నొప్పి ఇప్పుడు భరించదగ్గదిగా మాత్రమే వుంది. అతనికి నిద్ర బాగా పడుతున్నది. అతను తన మెరుగుదల 'నాటకీయమైనది' అని వర్ణించారు. అతను తనకుడిచేతితో చిన్న పనులు చేస్తూ, యింట్లో తిరగగలుస్తున్నారు. దీని తరువాత, అతను ప్రతివారం తననొప్పి 10% తగ్గుతున్నట్లు నివేదించాడు. 4వ వారం చివరికి 60% మెరుగైంది.
మే చివరలో అతను ఆసుపత్రికి వెళ్ళగా, ఆ వయస్సులో అంత వేగంగా కోలుకున్నందుకు డాక్టర్ సంతోషింఛారు. X- రే లో ఎముక చక్కని అమర్పుతో అతుక్కుంటున్నట్లు గమనించారు. అందువలన అతను ఫిజియోథెరపీ [భౌతిక చికిత్స] కోసం పంపబడినారు. రోగి తను పూర్తిగా కోలుకున్నట్లు భావించినందున, చికిత్సను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. అతను 2 నెలలపాటు నాలుగు చికిత్స(థెరపీ) సెషన్లకు వెళ్ళినారు. జూన్ నెల మధ్యలో రోగి కారు నడపడం మొదలుపెట్టి, తన ఎడమచేతితో తేలికపనులు చేసుకోగలిగారు. ఆగష్టు 5 న ఆసుపత్రిలో అతని చివరి సెషన్లో, డాక్టర్ రోగి మెరుగుదలకు చాలా సంతోషం వ్యక్తం చేసి, అతని వయస్సులో గొప్పగా మెరుగైందని ధృవీకరించారు. ఆగస్టులో రెండవ వారంలో, రోగి తిరిగి గోల్ఫ్ ఆడుటకు వెళ్ళారు కానీ 2 తేలిక స్ట్రోక్స్ మాత్రమే చేయగలిగారు. అతని ఎడమ చేతి క్రమంగా బలంగా తయారై, దాదాపు పూర్తిస్థాయి కదలికలను తిరిగి పొందగలిగాడు. 5 సెప్టెంబరు 2015 నాటికి అతను యధాప్రకారం అతని గోల్ఫ్ ఆట ఆడగలుగుతున్నందుకు సంతోషంగా ఉన్నారు.