నొప్పి, మోకాళ్లలో, కాళ్ళలో బలహీనత 02870...USA
80 ఏళ్ల వ్యక్తి, గతనెలలో (ఆగష్టు 2015 లో) పడిపోయినప్పుడు అయిన తనకుడికాలి గాయానికి చికిత్సకోరి వచ్చినారు. ప్రమాదం జరిగిన వారానికి, కుడి మోకాలు, పాదానికి మధ్యనున్న పొడుగు యెముకలో నొప్పివల్ల, నడుమునుండి కాలివరకు చాలబాధతో, కుడికాలు వాపు, తొడ, కాలు మీద గాయాలతో, ఆ ముసలాయన తనడాక్టర్ వద్దకు వెళ్ళిరి. ఎక్స్-రే లో ఎముకలేమి విరిగినట్లు తెలియలేదు. డాక్టర్ అతనిని మోకాలుకి ‘బ్రేస్’ వేసుకోమని, ఎముకల నిపుణుని సంప్రదించమని సిఫార్సు చేసిరి. రెండుమోకాళ్లలో కండరాలస్థాయి తగ్గుతుండటంతో ఎముకలనిపుణుడు భౌతిక చికిత్సను (ఫిజికల్ థెరపీ) సిఫార్సు చేశాడు. రోగి ప్రమాదంతో పడిపోవుటకు ముందే గత 6నెలలుగా, లేక ఏడాదిగా మోకాళ్ళ బలహీనతతో బాధపడుతున్నారు. 5 సెప్టెంబర్ 2015 న, రోగికి ఇవ్వబడిన రెమిడీ:
CC10.1 Emergencies + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.4 Muscles & Supportive tissue + CC20.7 Fractures…TDS
కేవలం 4 రోజుల తరువాత, రోగి నొప్పి 50% తగ్గినట్లు భావించారు. అతను తన మోకాళ్ళు బలంగా అవుతున్నట్లు గమనించి, మోకాలి బ్రేస్ ను ఉపయోగించడం నిలిపివేశారు. అంతేకాక, మెట్లు పైకి వెళ్ళేటప్పుడు, తనని తాను నిలవరించుకోవటాన, ప్రక్కనే ఉండే రైలింగ్ పట్టుకునే అవసరం లేకుండా పోయింది.
14 సెప్టెంబరులో, అతను తన మొదటి సెషన్ కోసం ఫిజికల్ థెరపిస్ట్ వద్దకు వెళ్లారు. అతని కుడి మోకాలిలో కొంతబలహీనత తప్ప, నొప్పి లేదు. కనుక థెరపిస్ట్ ని చూడవలసిన అవసరం వుందనుకోవటంలేదు. డాక్టర్ కదలిక, బరువు మోసే వ్యాయామాలు చేయించారు కాని అతని కుడికాలిలో లోపం లేనందువల్ల, అదే రోజు చికిత్స నుండి పంపివేసినారు.
3 వారాల చికిత్స తర్వాత (సెప్టెంబరు 27), నొప్పి తగ్గుటవల్ల రోగికి మోతాదు OD కు తగ్గించబడింది. వైబ్లియోనిక్స్ చికిత్సకు ముందు కంటే అతని మోకాళ్ళు 75% బలపడ్డాయి. అక్టోబరు 10, 2015 నాటికి, రోగికి ఏమాత్రం నొప్పిలేదు. అతను ప్రమాద జరగక ముందు మాదిరిగానే - ఆవరణలో పచ్చిగడ్డి కోయటం, వంటచెరకు తీసుకురావడం,, చెత్తను పారబోయటం వంటి తన సాధారణ కార్యకలాపాలను సులువుగా చేయ గలుస్తున్నారు. అభ్యాసకుడు రోగికి మోతాదు మరింత తగ్గించి, 3TW నిర్వహణ మోతాదుతీసుకొనుటకు రోగికి సలహానిచ్చిరి.