తక్కువ రక్తప్రసరణం, వెన్ను నొప్పి, తెల్లకుసుమవ్యాధి, దురద 02799...UK
76 సం.ల. మహిళ చాలా చల్లని పాదాలు, వెన్నునొప్పి, తెల్లకుసుమవ్యాధితో బాధపడుతూ 2014 జూలై 23 తేదీన అభ్యాసకుని వద్దకు వచ్చారు. బాల్యంనుంచి తక్కువ రక్తప్రసరణ కారణంగా, ఆమె ఎల్లప్పుడూ అతిశీతలంతో బాధపడేవారు. స్పాండిలైటిస్ (spondylitis) కారణం గా వెన్నునొప్పితో గత 20 సం.లుగా బాధపడుతూ, నొప్పి ఉపశమనానికి మాత్రలతో చికిత్స పొందారు, కానీ తాత్కాలికంగా చాలా తక్కువ ఉపశమనం కలిగేది. ఇవి కాక రోగి ఇతర మందులేవీ తీసుకొనలేదు. ఆమెకు క్రింది వైబ్రో రెమిడీ తో చికిత్స జరిగింది:
రక్తప్రసరణ మెరుగు కొరకు:
#1. CC3.1 Heart tonic + CC3.5 Arteriosclerosis + CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…QDS for one month, then TDS
స్పాండిలైటిస్ నివారణకు:
#2. CC18.5 Neuralgia + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…QDS నెల వరకూ తరువాత TDS
3½ నెలలతరువాత, రోగి తనపాదాల చల్లదనం బాధ 30% నయమైనట్లు, వెన్నునొప్పి 20% తగ్గినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె #1 and #2 TDS.గా తీసుకుంటున్నారు.
రోగి ఒకసారి వచ్చినపుడు, గత 1½ సం.లు.గా తనకు తెల్లబట్ట (తెల్ల కుసుమవ్యాధి), దానిమూలంగా యోనివద్ద దురద కలవని, బాధగా చెప్పినది. ఆమె దీనికి యే చికిత్సా తీసుకోలేదు. ఆమెకు క్రింది రెమిడీ ఇచ్చారు:
తెల్లబట్ట లేక కుసుమ వ్యాధి, దురదకు:
#3. CC8.1 Female tonic + CC8.5 Vagina & Cervix + CC21.1 Skin tonic + CC21.3 Skin allergies + CC21.7 Fungus…QDS నెల వరకూ తరువాత TDS
ఏడువారాల తరువాత, రోగి తనకి తెల్లకుసుమవ్యాధి, దురద పూర్తిగా తగ్గిపోయినట్లు కృతజ్ణతాపూర్వకంగా తెలిపారు. కనుక #3 మోతాదు BD కితగ్గించి ఒక వారం రోజులు తరువాత ఆపే ముందు మరొక వారం OD గా సూచించారు. ఆమె ఇతర వ్యాధుల లక్షణాలు కూడా బాగా తగ్గినవి: ఆమె వెన్ను నొప్పి 70% తగ్గింది, మరియు చల్లని పాదాలు 50% నయమైనవి. ఆమె # 1 మరియు # 2 TDS గా కొనసాగించారు. 30 మే 2015 న చూసినప్పుడు, ఆమె వెన్నునొప్పి మరియు చల్లని పాదాలు 90% మెరుగైనవి, కాబట్టి # 1 మరియు # 2 BD కి తగ్గించబడ్డాయి. 23 సెప్టెంబర్ 2015 న రోగి తన వెన్నునొప్పి, చల్లని పాదాలు పూర్తిగా తగ్గిపోయినట్లు తెలిపారు. అక్టోబర్ 2015 నాటికి, ఆమె #1 మరియు #2 ను OD కొనసాగిస్తున్నారు.