విరిగిన మణికట్టు వలన నొప్పి 01644...USA
ప్రాక్టీషనర్ ఇలా వ్రాస్తున్నారు: అక్టోబర్ 2012 లో నా ఏ.వి.పి. (AVP) శిక్షణ తీసుకుంటున్నప్పుడు, డాక్టర్ అగర్వాల్ మాతోపాటు తీసుకొని వెళ్ళుటకు వెల్నెస్ కిట్ తయారు చేయమని మాకు చెప్పారు. నేను ఇంతకుముందే కిట్ సిద్ధపరచి ఉన్నందుకు సంతోషించేను. ఏలననగా ఒకనాటి అర్ధరాత్రి, దగ్గరలోనే వున్న, తోటి వైబ్రో వైద్యురాలయిన మిత్రురాలు (63 సం.లు.) తనను ఆసుపత్రికి తీసుకెళ్ళమని నన్ను పిలిచి అడిగిరి. ఆమె చీకటిలో పెద్ద యోగా బంతి మీద జాఋ పడినందున, ఆమె మణికట్టు విరిగి, బాగా నొప్పిగా వున్నది. నొప్పివల్ల, దిగ్బ్రాంతివల్ల మారిన ఆమె స్వరాన్ని నిజానికి, నేను మొదట గుర్తించలేదు. ఆసుపత్రికి తీసుకెళ్తున్న20 నిముషాలలో, నాకు నా పర్స్ లోని వెల్నెస్ కిట్ లోని CC10.1 అత్యవసర రెమిడీ గుర్తుకు వచ్చింది. చీకటిలో, ఎన్ని మాత్రలు సీసా మూతలో పడ్డాయో, ఎన్ని ఆమె నోట్లో పడ్డాయో నేను చూడలేకపోయేను. కానీ రెమిడీ తీసుకున్న తర్వాత, వెనువెంటనే ఏదో మారింది. ఆమె శ్వాసవేగం తగ్గి, ఆమె మూలుగు కూడా తగ్గింది. ఆసుపత్రిలోకి వెళ్ళేముందు ఒక మోతాదు, మరియు ఆసుపత్రిలో మరో రెండు మోతాదులు (ఆసుపత్రి సిబ్బంది చూడకుండా) ఇచ్చాను. గంట తరువాత, డాక్టర్ ఎక్స్- రే తో తిరిగి వచ్చిరి. అంతవరకు రోగి నొప్పికి ఏమందు ఇవ్వలేదు. డాక్టర్ "నొప్పి 1 నుండి 10 వరకు ఏస్థాయిలో వుంద"ని ఆమెను అడిగారు. ఆమె బాగా ఆలోచించి, చివరికి "7" అని చెప్పింది. డాక్టర్ "మీరు నొప్పిని బాగా ఓర్చుకోగలిగి ఉండాలి. 'మరెవరైనా అయితే నొప్పి స్థాయి 30 ఉంది' అని చెప్పేవారు. మీ ఎముకలు విరిగి, రెండోవైపు పొడుచుకుని వచ్చినవి."అన్నారు.
వైబ్రో వైద్యుని వ్యాఖ్య:
బాబాకు చేసిన ప్రార్ధనలవలన, CC10.1 అత్యవసర వైద్యం వలన, బాగా ఎముకలు విరిగినప్పటికి, రోగి తక్కువ నొప్పితో మరియు ప్రశాంతమైన స్థితిలో ఉన్నారు.