దీర్ఘకాలిక పొత్తి కడుపునొప్పి & మలబద్ధకం 03523...UK
8 సం.ల. పాప గత 3 సం.లు. గా పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతున్నది. ఆ నొప్పి పగటి వేళలో కాస్త తక్కువగా, రాత్రి వేళలో హెచ్చుగా వుంటుంది. నొప్పి తీవ్రతనుబట్టి కొన్నిరాత్రులు ఆమె నేలపై బాధతో దొర్లుతుండేది. ఆసుపత్రిలో పరీక్షలు అన్నీ చేయించినను, వైద్యులు కారణాన్ని గుర్తించలేకపోయారు. గత 11 నెలలుగా ఆమె మలబద్ధకంతో కూడా బాధపడుచూ, దీని కోసం అలోపతి మందు తీసుకుంటున్నది. 24 మార్చి 2015 న ఆమెకు క్రింది రెమిడీ ఇచ్చారు:
#1. CC4.3 Appendicitis + CC4.4 Constipation + CC12.2 Child tonic + CC13.2 Kidney & Bladder infections + CC15.1 Mental & Emotional tonic...TDS
వారం తరువాత, పాపకునొప్పి 10% తగ్గినదని, తల్లి చెప్పారు. నెల తరువాత, నొప్పికి, నొప్పికి మధ్య విరామాలు ఎక్కువగుటయేకాక, 70% మెరుగుదల కలిగింది. ఆమె మలబద్ధకం 100% తగ్గినది. పై కాంబోకి మరో రెండు మిశ్రమాలు చేర్చబడ్డాయి:
#2. CC4.10 Indigestion + CC10.1 Emergencies + #1...TDS
ప్రస్తుతం సెప్టెంబర్ 2015 నాటికి, పాప అప్పుడప్పుడు అనగా 15రోజులకొకసారి నొప్పితో బాధపడుతోంది. మొదటికన్నా బాధ90% తగ్గినది. కనుక నొప్పి వచ్చినప్పుడు మాత్రమే ఈ పరిహారం ఇవ్వడానికి బదులు, తల్లికి OD ని నివారణగా ఇవ్వమని సూచించిరి.
రోగి తల్లి వ్యాఖ్య: మే 2012 లో మా 5 సం.ల.కుమార్తెకు తీవ్రమైన పొత్తికడుపునొప్పి మొదలైనది. ఆమె దాదాపు ప్రతి రోజూ, రోజులో చాల భాగం ఆనొప్పితో కొన్ని నెలలపాటు బాధపడినది. అనేక తనిఖీలు, ఉదర స్కానింగు చేసిన తరువాత కూడా, వైద్యులు ఆమె సమస్య కనుగొన లేకపోయిరి. మే నుండి 2014 ఆమెకు మలబద్ధకం కూడా వచ్చినది. ఆమె కడుపునొప్పి కొనసాగుతూనే వున్నది.
మార్చి 2015 చివరిలో, ఆమె నీటితో సాయి వైబ్రియోనిక్స్ రెమిడీ తీసుకోవటం ప్రారంభించినది. కొన్నిరోజుల్లోనే మలబద్ధకం పూర్తిగా తగ్గింది. ఆమె కడుపునొప్పి కూడా తరచుగా రావటం లేదు చాలావరకు తగ్గింది. ఇప్పుడు ఆగష్టు 2015 లో, ఆమెకు సగటున 15రోజులకొకసారి నొప్పి వస్తుంది. అప్పుడు కూడా గతంలో మాదిరిగా తీవ్రంగా కాని, ఎక్కువసేపు కాని వుండదు. నేను ఆమె బాధ 93% తగ్గిందని చెప్పగలను.
మాత్రలు మా కుమార్తె జీవితంపై అపారమైన ప్రభావాన్ని కలిగించినవి. నొప్పితీవ్రత వల్ల, ఆమె పాఠశాలలో నేలపై మఠం వేసుకుని కూర్చుండలేకపోయేది. కొన్ని రోజులపాటు ఆమె పడుకుని మాత్రమే వుండేది. ఆమెను ఆస్థితిలో వదిలి, మేము బయటకు వెళ్లి, రోజువారీ జీవితం కొనసాగించలేకపోయాము. ఆమె మలబద్ధకం కోసం తీసుకుంటున్న ఔషధంవల్ల ఏమి మెరుగవలేదు. మా కుమార్తె ఆరోగ్యం ఎప్పుడెలా వుంటుందో తెలియక మేము ముందు ప్లానింగ్ చేయలేక పోయే వారము. అదృష్టవశాత్తూ, దేవుని దయవలన మా స్నేహితుడు ఇటీవల సాయి వైబ్రోనిక్స్ కోర్సును చేశాడని మేము తెలుసుకున్నాము. తక్షణమే మనకు కావలసింది సరిగ్గా యిదేనని భావించాము. ఇంత త్వరగా నాకుమార్తె బాధ తగ్గడం నాకొక అద్భుతం. అంతేకాక, ఆమె ఇప్పుడు బాధ కలిగినా, ఆమె చక్కెరమాత్ర తీసుకోగానే వెంటనే నొప్పి మాయమవుతుంది. ఇది మనందరికీ భగవంతుడిచ్చిన వరము.