కాలిపిక్కయొక్క ముందఱిభాగములో అస్థిమధ్యశోథ 02786...Russia
కాలిపిక్కయొక్క ముందఱిభాగములో అస్థిమధ్యశోథతో భాదపడుతున్న అజెర్బైజాన్ నుండి వచ్చిన ఒక 59 సంవత్సరాల వయసు గల ఒక మహిళ చికిత్స కొరకు నిపుణులను సంప్రదించింది. అస్థిమధ్యశోథ - సాధారణంగా అంటువ్యాధి కారణంగా కలిగే ఎముక యొక్క శోధము మరియు చీము కారుట. ఈ రోగి యొక్క కాలిపిక్కయొక్క ముందఱిభాగము నిర్జీవమైన మరకలతో పాటు నీలం మరియు భూడిద రంగులో ఉంది. ఎముక లోపల వైపున చీము కారుతున్న మూడు భగందరము/నాళవ్రణాలున్నాయి. వంకర పడిన కాలి వేళ్ళకు రక్త ప్రవాహం సక్రమంగా జరగనందువల్ల రోగికి నడిచేడప్పుడు నొప్పిగా ఉండేది.
రోగికున్న ఈ సమస్య యొక్క చరిత్ర: రోగి తన బాల్యంలో ఒక పిల్లల గృహంలో పెంచబడింది. ఆ సమయంలో కఠోర వ్యవహారాన్ని ఎదుర్కొన్న ఈ రోగి సంతోషం లేని బాల్యాన్ని గడపవలసి వచ్చింది. పది సంవత్సరాల వయసులో ఒక ఎత్తైన స్థలం నుండి దూకడం కారణంగా తన కుడి పాదం తీవ్రంగా గాయపడింది. ఈ గాయాన్ని సరిచేయడానికి ఈమెకు శస్త్రచికిత్స చేయబడింది కాని, దీని కారణంగా కండరాల భాలహీనత ప్రారంభమైంది. అల్లోపతి డాక్టర్లు రోగికున్న ఈ సమస్యకి కారణం పోలియో వ్యాదియని నిర్ధారణ చేసారు. రోగికి ముప్పై సంవత్సరాల వయసులో శస్త్ర చికిత్సతో బాటు అల్లోపతి వైద్యం చేయబడింది కాని సఫలితం లభించలేదు. ఆ తర్వాత డాక్టర్లు ఈమెకు ఆస్టియోమైలిటిస్ అని నిర్ధారణ చేసారు. చికిత్సా నిపుణుడను సంప్రదించడానికి ఐదు సంవత్సరాల ముందు రోగికి వైద్యులు పరిస్థితి క్షీణిస్తున్న కారణంగా కాలును చేదించాలని చెప్పారు.
చికిత్సా నిపుణులు క్రింది మందులను ఇవ్వడం జరిగింది:
#1. CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities…TDS
#2. CC20.6 Osteoporosis…6TD
మందు ప్రారంభించిన ఒక వారం తర్వాత రోగి, కాలి వేళ్ళల్లో కొంత నొప్పి ఉన్నప్పటికీ సులభంగా నడవ గలిగింది. ఈమెకు #2 గోలీల సీసాకు బదులు క్రింది మందు ఇవ్వబడింది:
#3. CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis…TDS మరియు
#4. CC21.11 Wounds & Abrasions…TDS (నూనిలో కలిపి చీము కారుతున్న భగందరముల(ఫిస్త్యులా) పై రాయడానికి.
మూడు వారాల తర్వాత రోగి పాదం యొక్క రంగు సాధారణ రంగులో మారింది. భగందరము నుండి కొద్దిగా చీము కారటం కొనసాగడం వల్ల చికిత్సా నిపుణుడు క్రింది మందులను ఇచ్చారు:
#5. Nosode of pus from fistulas…6TD
రెండు నెలల తర్వాత కాలిపిక్క యొక్క రంగు కూడా సాధారణ రంగులోకి మారింది. అంతకు ముందు చీము కారుతున్న భగందరములలో రెండు పూర్తిగా నయమైపొయాయి. ఒక భగందరము నుండి మాత్రం చీముకు భధులుగా ద్రవం కారింది. చికిత్సా నిపుణులు #1 ను ఆపి మరిన్ని #3 మరియు #5 సీసాలను ఇచ్చారు.
అనేక సంవత్సరాల నుండి భాదపడుతున్న వ్యాధి నుండి ఉపశమనం కలిగినందుకు ఈ రోగి చాలా సంతోషపడింది.