అసాధారణ గుండె దడ (క్రమబద్దంగా లేని హృదయ స్పందన), బాధాకరమైన తుంటి 01620...France
77ఏళ్ల మహిళ 20 ఏప్రిల్ 2015న దీర్ఘకాల గుండెదడ మరియు తుంటి సమస్యలకు చికిత్స చేయమని కోరారు. ఒక ఏడాదిపాటు ఆమెకు తరచూ క్రమబద్దము లేని హృదయస్పందన ఉండేది. గుండెదడ ఒక్కొక్కసారి రోజంతా వుండేది. తనకు గుండెజబ్బు వున్నదేమోనని ఆమె భయపడినది. కానీ ఆమె ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ECG) రిపోర్టు మామూలుగానే వున్నది.
అది చాలక ఆమెకు 4నెలల క్రితం ఎడమతుంటిలో నొప్పులు మొదలైనవి. కానీ ఎక్స్-రే లో ఏలోపము కనిపించలేదు. తుంటినొప్పివలన ఆమె నడుచుటకు, మెట్లు యెక్కుటకు బాధపడు తున్నది. భారీ వస్తువులు కదిపినా, మోసినా విపరీతంగా అలసిపోవుచున్నది. రోగికి అలోపతి మందులు నచ్చక, తన బాధలకు ఎటువంటి అల్లోపతీచికిత్సా తీసుకొనలేదు.
వైబ్రియోనిక్స్ వైద్యుని సంప్రదించువేళలో ఆమె ఎడతెరపి లేకుండా మాట్లాడుతూనే, భావోద్వేగస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇది ఆమెకు అలవాటు అనిపించి, ఆమెకు ఈ క్రింది పరిహారం ఇవ్వబడినది:
గుండె అసంబద్ద స్పందనల కొరకు:
#1. CC3.6 Pulse irregular + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...TDS and if in crisis, 1 dose every 10 min for 1 hour or 2 hours if necessary
తుంటినొప్పి కొరకు:
#2. NM3 Bone I + CC20.3 Arthritis + CC20.4 Muscle & Supportive tissue...TDS
పదిరోజుల తర్వాత, రోగి #1 గంటకొకసారి తీసుకోవడంవల్ల గుండెదడ పూర్తిగా తగ్గినట్లు చెప్పారు. గుండెను బలంచేసే పద్ధతిని (కార్డియాక్ కొహెరెన్స్ టెక్నిక్) ఉపయోగించి విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోమని రోగికి సలహా ఇచ్చారు. 4వారాల తరువాత రోగి తన తుంటినొప్పి తగ్గి, మామూలుగా నడవగల్గుతున్నానని చెప్పారు. రోగి గుండె సన్నిహిత సాంకేతికత (కార్డియాక్ కొహెరెన్స్ టెక్నిక్) మంచిదే ఐనప్పటికి, ఆమె ఉపయోగించలేదు.
6వారాల తరువాత ఆమె తనకు గుండెకి సంబంధించిన సమస్యలేమీ లేవని, 6 కి.మీ. (సుమారు 4మైళ్ళు) ఒక్కొక్కసారి అంతకంటే ఎక్కువ నడిచి వెళ్ళగలనని, చాలాకాలం తర్వాత తనకు ఆరోగ్యం ఎంతో బాగుందని చెప్పారు. రెండు రెమిడీల మోతాదు 2వారాలపాటు OD కి తగ్గించబడింది, మరో 2వారాలపాటు 2TW, ఆపైన మందు ఆపడానికి 2వారాలు ముందు OW గా ఇచ్చారు. సెప్టెంబర్ 2015 నాటికి, రోగి బాగా ఆరోగ్యం పొంది, తన సంతోషము, కృతజ్ఞత వ్యక్తం చేసారు.