కోడి పిల్లలలో వ్యాధి 02715...Germany
ఒక విబ్రియో అభ్యాసకుని తల్లికి 23 కోళ్ళు ఉండేవి. కానీ ఒక అంటు వ్యాధి వలన మూడు తప్ప మిగిలిన కోళ్ళు చనిపోయాయి. ఆ మూడింటిలో ఒక కోడి చాల బలహీనంగా ఉండి, తల ఎత్తడానికి, నేరుగా నడవటానికి చాలా ఇబ్బందిపడేది. ఈ కోడి మిగిలిన రెండు కోళ్ళ నుంచి ఇంట్లో వేరుగా ఉంచబడినది. విబ్రియో అభ్యాసకురాలు ఈ క్రింది రెమేడిలను తన తల్లికి పంపించింది.
CC1.1 Animal Tonic + CC18.4 Stroke…TDS
అభ్యాసకురాలి తల్లి ఆ బిళ్ళలను కోడి పిల్లల ముక్కులో వేసేది. కొద్ది రోజులలోనే వాటి ఆరోగ్య పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. బాగా బలహీనంగా ఉన్న కోడి పిల్ల తల ఎత్తి, ఆహారం బాగా తినగలగుతూ చక్కగా నడవసాగింది. ఒక వారం తరువాత అది గుడ్లు కూడా పెట్టగలిగింది. అందువలన ఇప్పుడు ఈ రేమడీలు రోజుకి ఒక మారు తీసుకుంటున్నది(OD). తరువాత అదే రేమేడి బలహీనంగా, బరువు తక్కువుగా ఉన్న మిగిలిన రెండు కోళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా తక్కువ సమయంలోనే పుంజుకున్నాయి. అబ్యాసకురాలి తల్లికి ఇప్పుడు మూడు ఆరోగ్యవంతమైన కోళ్ళు ఉండడంవలన, మొత్తం కోళ్ల మంద చనిపోవడం అనే బాధ నుంచి కొంత ఉపశమనం లభించింది.